Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ఈ భామకు పరిచయం అవసరం లేదు. తన ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ 100 తో పాయల్ తెలుగు కుర్రాళ్ల మనసును దోచేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయాయి. అయితే తాజాగా తనుకు విజయాన్ని అందించిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో మళ్లీ పని చేసింది ఈ బ్యూటీ. మంగళవారం మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించునుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం సంగతులతో పాటు తన క్యారెక్టర్ గురించిన విషయాలను తాజాగా పాయల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ..” అజయ్ భూపతితో ఇది నాకు రెండో సినిమా. నేనే అజయ్‌కి కాల్ చేసి ఛాన్స్ ఇవ్వాలని అడిగాను. క్యారెక్టర్ వచ్చినప్పుడు కచ్చితంగా ఇస్తానన్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్లకు నన్ను తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. అలా మంగళవారం మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ లో ఇది సెన్సేషనల్ మూవీ గా నిలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాత్రతో ఇప్పటివరకు ఎవరూ మూవీ చేయలేదు.
శైలూ పాత్ర ఎన్నో ఎమోషన్స్ కలిగిన పాత్ర. శైలూ విలన్ కాదు. సినిమా చూస్తే శైలు పై సానుభూతి పెరుగుతుంది. ఇప్పటివరకు నా కెరీర్ లో చాలా ఇంటెన్సివ్ రోల్స్ చేశాను కానీ ఇది వేరే లెవెల్. కథ విన్నాక ఫ్లాట్ అయిపోయా వెంటనే అజయ్ తో పనిచేస్తున్నానని అమ్మకు చెప్పాను.ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ ఏకంగా 30 నుంచి 35 మంది అమ్మాయిల ఆడిషన్స్ చేశారట. ఈ ఆడిషన్స్ గురించి తెలుసుకొని నేనే కాల్ చేశాను. నన్ను తీసుకోవచ్చు కదా అని అడిగాను. ఎందుకంటే అజయ్ టాలెంట్ ఏంటో నాకు తెలుసు అందుకే ఉండబట్టలేక అడిగాను. దీంతో అజయ్ నా గురించి ఆలోచించి ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేశారు.
‘మంగళవారం’ సినిమా చూసినప్పుడు కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు. ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు. ఇక ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయతో మళ్లీ యాక్ట్ పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ అది కుదరడం లేదు. మేమిద్దరం కలిసి పని చేయాలి అంటే మంచి కథ దొరకాలి. అప్పుడే మా ఇద్దరికీ వర్కౌట్ అవుతుంది”అని పాయల్ తెలిపింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.