Payal Ghosh: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఆత్మహత్యల ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. గతంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ప్రయాణం హీరోయిన్ గా నటించిన పాయల్ ఘోష్ అందరికి పరిచయం ఉండే ఉంటుంది. ఆ తరువాత ఊసరవెల్లి సినిమాలో ఆమె తమన్నాకి ఫ్రెండ్ రోల్ లో నటించింది. ఆ తరువాత తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆమె బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సెన్సేషన్ అయ్యింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద ఆమె లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టింది. వాటిపై అతను కూడా రియాక్ట్ అయ్యారు. ఆ ఘటన 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత మరల ఈమె సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్ పోస్ట్ చేసి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ సూసైడ్ లెటర్ లో పాయల్ ఘోష్ తన చావుకి వారే కారణం అంటూ రాసుకొచ్చింది. నేను పాయల్ ఘోష్. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకున్నా, గుండెపోటుతో చనిపోయిన దానికి వారే కారణం అవుతారు అంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొంది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందించి.
ప్రస్తుతం మీరు బాగానే ఉన్నారు కదా అని ఆమె భాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేసింది. తునీషా శర్మ ఆత్మహత్య తనని దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు మనుషులు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకి ఎలా వస్తారో అనే డౌట్ వస్తుంది. అయితే మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికి నిర్లక్ష్యం చేయకూడదు మాత్రం అర్ధం అవుతుంది. ప్రజలు కూడా దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆత్మహత్య అనేది సమస్యలకి పరిష్కారం కాదు. మనల్ని మనం నమ్మడం జీవితం అనే పరుగు పందెంలో ముందుకి వెళ్ళగలం అని పాయల్ ఘోష్ పోస్ట్ లో పేర్కొంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.