pawan-kalyan-ustad-bhagath-singh-songs-done-by-devi-sri
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలు పెట్టుకొని ఉన్నారు. ఓ వైపు జనసేనతో రాజకీయంగా ఏపీలో బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న ఆర్ధిక వనరులు సహకరించకపోవడం వలన సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల ద్వారా వచ్చే డబ్బుని పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ దశలో ఉండగానే సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పేసి లాంచింగ్ కూడా చేసేశారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. అలాగే సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సిత్తం సినిమా కూడా ఉంది.
ఈ అయితే వీటిలో ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అర్ధం కాని ప్రశ్నగా పవర్ స్టార్ అభిమానుల ముందు ఉంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హరిహరవీరమల్లు షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందని తెలుస్తుంది. అలాగే వినోదాయ సిత్తం మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సాంగ్ ని ఇప్పటికే హరీష్ శంకర్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వినడం జరిగిందని తెలుస్తుంది. ఇక సాంగ్ పవన్ కళ్యాణ్ కి భాగా కనెక్ట్ అయ్యిందనే మాట వినిపిస్తుంది. ఇక హరీష్ శంకర్ షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కచ్చితంగా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.