Version 1.0.0
Pawan Kalyan : రెండు నెలలుగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. ఏపీలో టీడీపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 10 ఏళ్లుగా విజయం కోసం పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రికార్డుస్థాయి మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 70వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే సాబ్ అయ్యారు.
మొదటిసారిగా అధికారిక లాంఛనాలతో త్వరలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కోసం సేవ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన 21మంది జనసేన అభ్యర్థులు కూడా ఘన విజయాన్ని సాధించారు. రెండు ఎంపీ స్థానాలను కూడా జనసేన గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో పవన్ విక్టరీతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను భావోద్వేగానికి లోనయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వపన్ రాజకీయాల్లోనూ తన దూకుడుతో విక్టరీ సాధించడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందలను తెలియజేశారు. అన్నయ్య చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ చెల్లెల్లు మెగా ఫ్యామిలీ మొత్తం సంబురాల్లో మునిగిపోయింది.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కూడా పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. ఓ వీడియోను నెట్టింట్లో విడుదల చేసి తన కొడుకు విజయం గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. అంజనా దేవి మాట్లాడుతూ..”ఈ రోజు మా అబ్బాయి రాజకీయాల్లో విక్టరీ సాధించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి ఆ దేవుడు మంచి ఫలితం ఇచ్చాడు. ఇక ఇవాళ్టి నుంచి నేను కూడా ప్రతి రోజు ఈ గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను” అని అంజనా దేవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.నెటిజన్స్ ఈ వీడియో చూసి అంజనమ్మకు కామెంట్లు చేస్తున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.