Categories: LatestNewsPolitics

Pawan Kalyan: నేను ఎవడికి అమ్ముడుపోయే వాడిని కాదు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నాలుగు రోజులు రాజకీయ కార్యాచరణని పవన్  సిద్ధం చేసుకున్నారు.  అందులో భాగంగా రెండో రోజు కాపు సంఘాలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను అన్ని కులాల వారీని కలుపుకొని వెళ్లాలని చెబుతాను. కాపులు పెద్దన్న పాత్ర పోషించి రాజ్యాధికారం రాని కులాలని కలుపుకొని వెళ్ళడం ద్వారా అధికారంలోకి రావొచ్చు.

అయితే కులంలోనే ఎవరికి నచ్చినట్లు వారు విడిపోయి వెళ్ళడం వలన ఎప్పటికి అధికారాన్ని అందుకోలెం. కాపులు నిజంగా నన్ను తమవాడిగా అనుకోని వుంటే భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో ఓడిపోయేవాడిని కాదని అన్నారు. అలాగే తాను పుట్టిన కులాన్ని విస్మరించుకొను అని కూడా తెలిపారు. అలాగే కాపులు తలవంచుకునే పని తాను ఎప్పుడూ చేయనని తెలిపారు. తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టె ప్రయత్నం చేయనని అన్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా పార్టీకి నష్టం కలిగించే కుట్రలు చేస్తున్నారని అన్నారు.

రాజకీయాలు అంటే కుట్రలు, కుతంత్రాలు సర్వసాధారణం అని అన్నారు. వాటిని ఎదుర్కొని బలంగా నిలబడాలి అని అన్నారు. తాను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాను. ఎవరో వెయ్యి కోట్లు ఆఫర్ అని ప్రచారం చేస్తారు. ఇంకొకరు అమ్ముడుపోయా అంటారు. తాను సినిమా చేస్తే రోజుకి రెండు కోట్లు సంపాదిస్తా ఆ సామర్ధ్యం తనకి ఉంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాలు చేసుకునేంత ఇమేజ్ ఉంది. కాని వాటన్నిటి కంటే నాకు కేవలం ప్రజలకి సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనని రాజ్యాధికారంలోకి తీసుకురావడంలో మీరే కీలక పాత్ర పోషించాలని తెలిపారు.

Varalakshmi

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

22 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

22 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.