Pawan Kalyan – Sai Dharam Tej : ఘనంగా మెగా మల్టీస్టారర్ ప్రారంభం అయింది. తమిళంలో నటుడు, దర్శకుడు సముద్రఖని రూపొందించిన సూపర్ హిట్ మూవీ వినోదాయ చిత్తం. ఓటీటీలో విడుదలై అద్బుతమైన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తెలుగు రీమేక్ పనులు మొదలుపెట్టారు. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై రక రకాల రూమర్స్ వచ్చాయి.
ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఆయన మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఈ కొత్త చిత్రాన్ని పవన్ నేడు పట్టాలెక్కించారు. తమిళ వెర్షన్‌ను రూపొందించిన సముద్రఖని తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎప్పటినుంచో మెగా మల్టీస్టారర్ కోసం మెగా అభిమానులే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి కోరిక ఇప్పుడు నెరవెవరబోతోంది.
ఇక తాజాగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్‌లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. చిత్రీకరణలో పాల్గొన్న పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ మీద మామా అల్లుళ్ళు చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహకందడం లేదు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
మరో వైపు సాయి ధరమ్ తేజ్ కూడా సెలెక్టెడ్‌గా చిత్రాలను చేస్తూ తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూన్నాడు. మరి ఈ మెగా మల్టీస్టారర్‌తో మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను నమోదు చేస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.