Pawan Kalyan : బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలోని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆధ్యంతం రసభరితంగా సాగుతోంది. పవన్‌తో ఇంటర్వ్యూ పిక్స్‌అని రివీల్ అయినప్పటి నుంచి పవన్‌కు సంబంధించిన ప్రతి ప్రోమో, గ్లింప్స్‌లు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. హీరోగా, రాజకీయనాయకుడిగా పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. తన సినిమాలతో అలరించే పవన్ కళ్యాణ్‌కు రాజకీయ శత్రువులు లేకపోలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాలను కొనసాగిస్తున్న వవన్ మూడు పెళ్లిల్లపై అనేక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. దీనిపైన పవన్ అనేకమార్లు క్లారిటీ ఇచ్చినా అన్‌స్టాపబుల్ షోలో మాత్రం ఆయన మాట్లాడిన మాటలు అందరిని బాగా అట్రాక్ట్ చేశాయి. అందులోనూ బాలయ్య పక్కన ఉండటంతో ఈ ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తికరంగా మారింది.
తాను చేసుకున్న మూడు పెళ్లిల్లపై పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ వేదికగా చాలా క్లియర్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాలయ్య సూటిగా సుత్తిలేకుండా పవన్ పెళ్లిల్ల గురించి స్ట్రయిట్ గా ప్రశ్నించాడు, అయితే పవన్ కళ్యాణ్ స్ట్రెయిట్‌గా పాయింట్‌కు రాకుండా అసలు తాను ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేశాడు. అసలు తాను ఒక్క పెళ్లి కూడా చేసుకోవాలనుకోలేదట. అలాంటిది మూడు పెళ్లిల్లు ఎలా చేసుకున్నానో అర్ధం కాలేదని, తానేనా మూడు పెళ్లిళ్లు చేసుకుందన్న అనుమానం వచ్చిందని పవన్ చెప్పుకొచ్చాడు. నిత్య బ్రహ్మచారిగా ఉండాలనుకున్నానని కానీ అది కుదురలేదని తెలిపారు. ఇదోదో పక్కా స్కెచ్ వేసి ప్లాన్ చేసి చేసుకున్న పెళ్లిల్లు కావని అన్నారు.
తన మొదటి పెళ్లి గురించి చెప్పుకొస్తూ. నా మొదటి పెళ్లి పెద్దలు చేసింది. వారు నిర్ణయించిన అమ్మాయినే చేసుకున్నాను. మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. దీనితో పెళ్లైన కొన్ని రోజుల్లోనే విడిపోయామన్నారు. రెండో పెళ్లి అందరికి తెలిసిందే రేనుదేశాయ్ నేడు ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, కానీ మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కొన్న కారణాల వల్ల ఇద్దరి అభిప్రాయాలు వేరుకావడం వల్ల ఇద్దరికి నచ్చే విడాకులు తీసుకున్నాము. ఇక ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నాను. మా ఫ్యామిలీ సాఫీగా ఉంది. అయితే ఇందులో అందరికి చెప్పేదేమిటంటే నేను ఇద్దరు భార్యలకు చట్టపరంగా డైవర్స్ ఇచ్చిన తరువాతే పెళ్లి చేసుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు పవన్. ప్రతిసారి మూడు పెళ్లిల్లు అనే టాపిక్ ను తీసుకువస్తారు. నేనేమి ముగ్గురికి ఒకేసారి చేసుకోలేదని తెలిపారు. ఇది చాలా మందికి నాపై దాడి చేయడానికి ఓ ఆయుదంగా మారిందని నాకు ఈ విషయంలో ఎలాంటి గిల్టీ లేదని పవన్ కూల్ గా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు. నేను ఎవ్వరితో వ్యామోహంతో పెళ్లిచేసుకోలేదని తన జీవితంలో అలా జరిగిపోయిందని అన్నారు. దానిని ఓ పెద్ద ఇష్యూ చేస్తున్నారన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.