Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలం రాజకీయ ప్రయాణంలో ఇప్పటివరకు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న నాయకుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీలతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. ఆ సమయంలో బిఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరై వారితో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బంధంలోనే కొనసాగుతున్నారు.
2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీ రాజకీయాలలో తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ కాస్త అగ్రిసివ్ మోడ్ లో ఏపీలో వెళ్తుంది. కొద్దిరోజుల క్రితం మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వీడియో రిలీజ్ చేసి వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రజలకు బేషారతుగా వైసీపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారంటూ విమర్శించడం విశేషం. కొత్త పొత్తులకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెరతీస్తున్నారని అందుకే బీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.
గతంలో తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే రకమైన ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 1000 కోట్ల ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి ఆశ చూపించింది అంటూ ఒక న్యూస్ ప్రచారం చేసింది. దానిపై జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజలను అవమానించారని వైసీపీ పై వ్యాఖ్యలు చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కొత్త పల్లవి అందుకోవడం ఆసక్తికరంగా మారింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.