Pawan Kalyan : ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు కళ్లారా చూడాలా అని మెగా కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. మైక్ ముందు పవన్ అనే నేను.. అంటూ పవర్ స్టార్ ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. ఈ అద్భుత దృష్యాన్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ కూడా సభా కార్యక్రమానికి బయల్దేరింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎననికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తన సత్తా ఏంటో చాటారు. ఇక ఇవాళ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం చూపు ఏపీపై పడింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ వేడుకను కళ్ళార చూడనికీ ముస్తాబు అయ్యింది. ఇక పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సుల్లో సంప్రదాయ దుస్తుల్లో వేడుకకు బయలు దేరారు.
ఇన్ని రోజుల్లో సినిమా కార్యక్రమాల వేదికపైనే పవన్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ టైమ్ పిఠాపురం ఎమ్మెల్యాగా, ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ స్పీచ్ వినిపించబోతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల కళ్లు కూడా ఆయన మీదే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడాలని అకీరా, ఆద్య, సాయిధరమ్ తేజ్, నిహారిక, చిరు,నాగబాబు ఫ్యామిలీ మొత్తం వేదికకు బయల్దేరింది. ప్రస్తుతం వారు బస్సులో కూర్చుని దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా అందరి కళ్లు అకీరా, ఆద్య పైనే ఉన్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.