Categories: EntertainmentLatest

Pawan Kalyan : ధర్మం కోసం యుద్ధం..హరిహర వీరమల్లు టీజర్ అద్భుతం

Pawan Kalyan : ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్ రానే వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకర్స్ అభిమానులను టీజర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. లేటెస్టుగా రిలీజైన హరిహరవీరమల్లు టీజర్ అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ టీజర్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ప్రేక్షకులను పూనకాలు తెప్పించడం ఖాయంగా అర్థమవుతోంది. మొఘల్స్ కాలంలో రాజులు, నవాబులు సామాన్య ప్రజలపై దాడి చేసి వారి శ్రమను దోచుకుంటుంటే..వారిని దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అంటూ టీజర్ లో చెప్పిన లైన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

pawan-kalyan-harihara-veeramallu-teaser-released

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా,సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం పెద్దగా రివీల్ చేయలేదు మూవీ టీమ్.దీంతో సినిమా ఇప్పట్లో వస్తుందా, రాదా అన్న అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అంతేకాదు అప్పట్లో సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. మేకర్స్ కూడా ఆ రూమర్లకు స్పందించకపోవడంతో ఆ న్యూస్ నిజమే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు సడెన్ గా టీజర్ రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది చిత్ర యూనిట్.

pawan-kalyan-harihara-veeramallu-teaser-released

పవన్ కళ్యాన్ ఓ వైపు ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతితో నాలుగైదు సినిమాలు ఉన్నాయి . హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో యంగ్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్ శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే విడదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక దీనితో పాటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఓజీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక డైరెక్టర్ క్రిష్ తో కలిసి హరిహర వీరమల్లు చేశారు. ఈమూవీ ప్రస్తుతం గ్రాఫిక్ పనులను జరుపుకుంటోంది.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

44 minutes ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

This website uses cookies.