Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎవరికీ వారు తమ వ్యూహాలని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. తగ్గేది లే అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాయి. ఇక ప్రత్యర్ధులని చెత్తు చేయడానికి ఎవరికివారు తమ వ్యూహాలని అమలు చేస్తూ ఉండటం విశేషం. అధికార పార్టీ వైసీపీ టీడీపీ, జనసేన కలవకుండా చేయడం కోసం రకరకాల వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళ్తున్నాయి. ఇక జనసేన పార్టీ వైసీపీని గద్దె దించి తాము ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని భావిస్తుంది. ఇక టీడీపీ కూడా ఒంటరిగా లేదంటే పొత్తుల ద్వారా వచ్చే ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇలా ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రజలకి చేరువ అయ్యేందుకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకొని వెళ్తున్నారు.
రానున్న ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధం అవుతుంది. అయితే జనసేన ఎక్కువగా సీట్లు అడుగుతూ ఉండటం అలాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా అడుగుతూ ఉండటంతో కొంత వరకు వెనక్కి తగ్గారు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. దీంతో సొంత బలంగా గెలవగలం అని టీడీపీ భావిస్తుంది. అయితే ఇదంతా జగన్ వ్యూహంలో భాగం అని పవన్ కళ్యాణ్ ఒక అంచనాకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. టీడీపీ, జనసేన మధ్య దూరం పెంచడం ద్వారా పొత్తుకి అవకాశం లేకుండా చేసి లబ్ది పొందాలని వైఎస్ జగన్ వేసిన వ్యూహంలో భాగమే అని భావిస్తున్నారు.
ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నాయని పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా వారి వ్యూహంలో ఇరుక్కోవద్దని, క్యాడర్ ని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని దెబ్బ తీసేందుకు అన్ని రకాలుగా వైసీపే కుట్రలు చేస్తుందని పవన్ కళ్యాణ్ అంచనాకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వారి వ్యూహాలకి అవకాశం ఇవ్వకుండా జనసైనికులు నమ్మకంతో ఉండాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ వ్యూహాలలో భాగంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వసించవద్దు అని సూచించారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.