Categories: LatestNewsPolitics

Pawan Kalyan: వైసీపీను కోలుకోలేని దెబ్బ కొట్టిన పవన్

Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీని గద్దె దించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కులాలని కలిపే అజెండాతో ముందుకి వెళ్తున్నారు. తన రాజకీయ కార్యాచరణలో భాగంగా వ్యూహాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రోజురోజకి జనసేన బలం ఏపీలో పెరుగుతుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే అది ఎంత వరకు ఓట్ గా టర్న్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తమని లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో  వైసీపీ కూడా తమ వ్యూహాలను అమల్లో పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే దీనిని జనసేన ఎప్పటికప్పుడు వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తున్నాయి. ఈ నేపధ్యంలో జనసేన ఆవిర్భావ సభకి కూడా లక్షల్లో ప్రజలు తరలివచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వను అనే పిలుపు బలంగా పనిచేసిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పవన్ కళ్యాణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అక్కడ బీజేపీ నుంచి మాధవ్ పోటీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా సపోర్ట్ చేయలేదు. వైసీపీ అభ్యర్ధిని ఓడించండి అని మాత్రమే పిలుపునిచ్చారు. దీనికి పట్టభద్రుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభించినట్లు కనిపిస్తుంది.

 

ఈ నేపధ్యంలో ఉత్తరాంద్రలో టీడీపీ అభ్యర్ధి గెలుపొందారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది అనే ప్రచారం కూడా బలంగా పనిచేయడంతో జనసేనకి అపార్ట్ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్ధికి ఓటు వేశారు. అలాగే ప్రకాశం, నెల్లూరు ఎమ్మెల్సీ అభ్యర్ధి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం పనిచేసింది అనే మాట వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కచ్చితంగా ఉంటుంది అనే క్లారిటీ ఈ ఎన్నికలతో వచ్చింది. ఇక తాజాగా ఈ విషయాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా సమర్ధించారు. బీజేపీ, వైసీపీ ఒకటే అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అని అన్నారు. వైసీపీకి వెనకుండి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఇది బీజేపీ మనుగడకి కష్టంగా మారుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వలన ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 

Varalakshmi

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.