Pawan Kalyan : ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో రసవత్తరంగా సాగింది. ఫినాలేకి ఎలాంటి గెస్ట్ పడాలో అలాంటి గెస్ట్ రావడంతో ఫైనల్ ఎపిసోడ్స్ బ్లాస్ట్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో సీజన్ 2 ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పూర్తైంది. సీజన్ 2 అనుకున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
దాంతో ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ షో మీద విపరీతమైన క్రేజ్ పెరిగింది. గోపీచంద్, ప్రభాస్ లాంటి వారు రావడంతో షో సెకండ్ సీజన్ హై రేంజ్‌లో సక్సెస్ అయింది. ఇక సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కి అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ వచ్చారు. మొదటిరోజు సెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే ఈ షో మీద భారీ స్థాయిలో హైప్ నెలకొంది.
అందుకు తగ్గట్టే ప్రోమోలు వదిలి ఆ హైప్‌ని ఇంకాస్త పెంచారు. ఒకే వేదికపై అటు నందమూరి హీరో ఇటు మెగా హీరో అలరించడం అంటే మామూలు విషయం కాదు. అంతకముందు పవన్ కళ్యాణ్, బాలయ్య ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. కానీ, అదంతా పొలిటికల్ పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు.. అని స్వయంగా పవన్ అన్‌స్టాపబుల్‌లో క్లారిటీ ఇచ్చారు.
ఎపిసోడ్ ఫైనల్‌లో నేరుగా బాలయ్య ఈ షోకి రాకముందు వచ్చిన తర్వాత నా గురించి ఏమనుకున్నారు..అని పవన్‌ను అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. బాలకృష్ణ గారంటే అంటే బయట ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను మాత్రం ముక్కుసూటి వ్యక్తి, మనసులో ఏదనిపిస్తే అదే బయటకు అంటారు. మంచైనా చెడైనా అది గుండెల్లో నుంచే వస్తుంది. బయటకి ఒకటి లోపల ఇంకోటి ఉండదు.. అనుకున్నాను.
మీ షోకి రాకముందు ఎలాంటి భావన ఉందో వచ్చిన తర్వాత కూడా అదే భావన కలిగింది..అని పవన్ చెప్పారు. ఇదే సందర్భంగా ఒకప్పుడు మీ సినిమాలు వరుసగా ఫ్లాపవుతుంటే మా ఇంట్లో నాగబాబుతో సహా అందరం బాలకృష్ణ గారి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాము..అంటూ వెల్లడించారు. ప్రస్తుతం బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలు అటు బాలయ్య అభిమానులు ఇటు పవన్ అభిమానులు చూసి ఎంతో సంబరపడుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.