Pavala Shyamala : హైపర్ ఆది నన్ను బ్రతికుండగానే చంపేశాడు..!

Pavala Shyamala :  పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రంగస్థలం నుంచి బుల్లితెర మీదుగా వెండితెర పైకి వచ్చిన నటి ఆమె. తన సహజ నటనతో, కామిక్ సెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  . అయితే ప్రస్తుతం సీనియర్ నటి, తన కూతురు ఇద్దరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పావలా శ్యామల చాలా ధీనస్థితిలో ఉన్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.  శ్యామల దీనస్థితిని బయట ప్రపంచానికి చెప్పడానికి కొన్ని  యూట్యూబ్ ఛానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ  ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’ షో గురించి, హైపర్ ఆది గురించి ఆమె మాట్లాడారు.  హైపర్ ఆది పైన శ్యామల ఫైర్ అయ్యారు. తాను బ్రతికుండగానే హైపర్ ఆది చంపేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

pavala-shyamala-fires-on-jabardasth-hyper-aadi

జబర్దస్త్’ కమెడీ షో తో మంచి కమెడియన్ గా రచయితగా గుర్తింపు సంపాదించుకున్నాడు హైపర్ ఆది. తనదైన స్క్రిప్ట్ రైటింగ్ తో హైపర్ ఆది ఈటీవీలో ఓ బ్రాండ్ గా స్థిరపడ్డాడు. అయితే ఆది చేసిన మిస్టేక్ ఏంటంటే పావుల శ్యామల ఫోటోను చనిపోయినవాళ్ల ఫొటోలు పక్కన పెట్టడమే. అది చూసిన సీనియర్ నటి తనను చనిపోయినట్టు చిత్రీకరించారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆది స్కిట్ చూసి తనకు  బాధకలిగిందని ఆమె అన్నారు..

పావలా శ్యామల చనిపోయారంటూ ఆ మధ్య రమర్స్  వచ్చాయి. దీనితో పావలా శ్యామలనే స్వయంగా తాను చనిపోలేదని, అనారోగ్యం పాలయ్యానని  చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి రూమర్లు వ్యాపించడానికి ఒకరిద్దరు కారణం కాదని.. అందరూ ఇలానే ఉన్నారని శ్యామల తెలిపారు .

‘జబర్దస్త్’ లాంటి షోలో సైతం తన ఫోటోని చనిపోయినవాళ్ల ఫొటోల పక్కన పెట్టడం భాద కలిగించింది అని అన్నారు శ్యామల . ఒక వ్యక్తి బ్రతికుండగానే ఇలా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉందన్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న నేను,  జబర్దస్త్ ప్రోగ్రాంకు వెళ్లి ఆదితో నీతో ఎవరు మాట్లాడించారు అని నేను అడగగలనా?అసలు ఆది నాకు దొరుకుతాడా? పోని నాకు ఫోన్ చేసి బతికున్నానా లేదా అని ఆది అడిగాడా?” అని పావలా శ్యామల ఫీల్ అయ్యింది.

నా గుండెలో రంధ్రాలు ఉన్నాయి. కిడ్నీ సమస్య కూడా ఉంది.నాకు హాస్పిటల్ ఖర్చు నెలకు రూ.10 వేలు అవుతుంది. నా కూతురు  కుర్చీకే పరిమితం అయ్యింది.ఆమెకు ఫిజియోథెరపీ చేయించాలి. దానికి డబ్బులు లేవు. అందుకే నా  కూతురు లేచి నడవలేకపోతోంది. సినిమా షూటింగ్‌లు, సన్మాన కార్యక్రమాల్లో పడి నా కూతురిని పట్టించుకోలేకపోయాను. ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు. ఆ బాధ నన్ను వేధిస్తోంది. మేమిద్దరం ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నాము. నెలకు రూ.30 వేలు ఇస్తున్నాము. ఎవరైనా సాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను ” అని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

15 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

16 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.