Parijatha Flowers: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దేవత వృక్షాలుగా భావిస్తారు. ఇలా దేవత వృక్షాలుగా భావించే వాటిలో పారిజాత పుష్పాలు ఒకటి.సాగరమధనం చేసే సమయంలో సముద్ర గర్భం నుంచి పారిజాత వృక్షం బయటపడటం వల్ల దీనిని దైవ సమానంగా భావిస్తారు. ఇక ఈ పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ వృక్షం కింద లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందుకే ఈ చెట్టును ప్రత్యేకంగా పూజలు చేయడంతో సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.
ఇక పారిజాత పుష్పాలతో దేవుడికి అర్చన చేసిన ఎంతో శుభ ఫలితం కలుగుతుంది. ఈ పుష్పాలతో మాల అల్లి దేవుడిని పూజించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే పారిజాత పుష్పాలు రాత్రి వికసించి ఉదయానికి నేలపై రాలుతాయి అయితే ఇలా నేలపై రాలిన పుష్పాలను దేవుడికి పెట్టవచ్చా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది దోషం ఉంటుంది కానీ పారిజాత పుష్పాలకు ఎలాంటి దోషం ఉండదు. ఇది నేల రాలిన పుష్పాలను ఏరుకొని దేవుడికి పెట్టడం ఎంతో శుభ సూచకం.
రాత్రి సమయంలో వికసించిన ఈ పారిజాత పువ్వులు ఉదయానికి అదే తాజాదనంతోను అదే సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు. ఇకపోతే పారిజాత వృక్షం కింద సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ వృక్షం పరిసర ప్రాంతాలలో చాలా పరిశుభ్రంగా ఉంచాలి అలాగే ఆవు పేడతో నేల మొత్తం అలికి ముగ్గులు పెట్టాలి. ఇలా అలికి ఉన్నటువంటి నేలపై రాలినటువంటి పుష్పాలను ఏరీ పూజించడం ఎంతో మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.