Papaya: ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు తినడానికన్నా రుచిగా ఉండే ఆహార పదార్థాలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోని రోడ్డు సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అతి చిన్న వయసులోనే అధిక శరీర బరువు పెరిగి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ శరీర బరువు తగ్గడానికి కొంతమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు.
ఈ విధంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్లో భాగంగా బొప్పాయిను చేర్చడం వల్ల వారానికి రెండు కిలోల వరకు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి నిజంగానే బొప్పాయి తీసుకోవడం వల్ల వారానికి రెండు కిలోల బరువు తగ్గుతారా నిపుణులు ఏమంటున్నారు అనే విషయానికి వస్తే…డైటీషియన్ సువిధి జైన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ బొప్పాయి పండు ఎంతో పోషక విలువలతో కూడుకున్నదని తెలిపారు.
ఇందులో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా విటమిన్ ఎ, సి, ఇ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని జైన్ చెప్పారు. బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు తక్కువ కేలరీలతో సంతృప్తి పొందవచ్చు ఇందులో కేలరీలు తక్కువగాను ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. అయితే వారానికి రెండు కిలోలు బరువు తగ్గతారనే విషయం అవాస్తవమే అయినప్పటికీ శరీర బరువు తగ్గుతారు అన్నది మాత్రం నిజం అయితే మన డైట్ లో భాగంగా బొప్పాయి తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
This website uses cookies.