Categories: Health

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ పూరి తినడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు అయితే పానీ పూరి రుచి పరంగా బాగున్నప్పటికీ ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ పానీపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇలా పానీపూరి ఇష్టంగా తిన్నప్పటికీ కొంతమంది మాత్రం పూర్తిగా పానీపూరికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి పానీ పూరి ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు అనే విషయానికి వస్తే

హై బీపీతో బాధపడేవారు పానీపూరికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ కారం నీళ్లలో ఉప్పు (సోడియం) శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది తద్వారా బీపీ మరింత ఎక్కువ కావడంతో గుండె పని తీరుపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి కనుక హై బీపీతో ఉండేవారు పానీ పూరి తినకపోవడం మంచిది.పానీపూరి పూరీలను ఒకే నూనెలో మళ్లీ మళ్లీ డీప్ ఫ్రై చేస్తారు. దీనివల్ల అందులో ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తినకపోవడం మంచిది.

Panipuri people with these health issues must avoid eating panipuri know details

Panipuri: జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు..

పానీపూరి తయారీలో వాడే మైదా, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, శరీరానికి మేలు చేసే పోషకాలు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇక శరీర బరువు పెరిగి ఉబకాయానికి కూడా కారణమవుతాయి. పానీపూరిలో వాడే అధిక మసాలాలు కారణంగా తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. ఇలా ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నవారు పానీపూరీలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.