packaged-food-creates-huge-damage-to-body
Health: ఆధునిక యుగంలో ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానాలలో చాల మార్పులు వచ్చాయి. ప్రజల అవసారాలని దృష్టిలో ఉంచుకొని వ్యాపారవేత్తలు నిల్వ ఉన్న ఆహారాలని ప్యాకేజ్ చేస్తూ అందిస్తున్నారు. పల్లెటూళ్ళలో స్వచ్చమైన ఆహారం అప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. అయితే సిటీ కల్చర్ పెరిగిపోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు బ్రతుకు తెరువు కోసం సిటీకి వలసలు పోతున్నారు. దీంతో సిటీలో ఉండే ప్రజల అవసారాలకి సరిపడా ఆహార పదార్ధాలు మామూలుగా దొరకడం లేదు. దీంతో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీలు ప్రజల అవసరాలని, వారి ఆహారపు అలవాట్లని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వాటిని అవి నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయినాలని ఉపయోగిస్తూ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.
అయితే వీటిని డైట్ అండ్ ప్రోటీన్ ఫుడ్ గా ప్రచారం చేస్తున్నారు. అలాగే హెల్డీ ఫుడ్ అంటూ ప్రమోషన్ చేస్తున్నారు. చివరికి సహజసిద్ధంగా లభించి కొబ్బరి నీళ్ళు కూడా ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచి అమ్మేస్తున్నారు. అలాగే టీ పొడి నుంచి చికెన్ వరకు అన్నింటిని కూడా ప్యాకేజ్ ఫుడ్ గా మార్చేసి సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఉపయోగించవచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రజలు కూడా ఈ ప్యాకేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఫుడ్స్ ప్రొడక్ట్స్ చాలా ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్ చేసి నిల్వ ఉంచి ఆహార పదార్ధాలని తరుచుగా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అండాశయ, బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మన రోజువారి ఆహారంలో 10 శాతం అల్ట్రా ప్యాకెజ్డ్ ఫుడ్ వాడడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 2% పెరుగుతుందని పేర్కొంటున్నారు. అదే అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 19% ఉంటుందని చెబుతున్నారు.
ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడం వలన క్యాన్సర్ మాత్రమె కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. టైప్ -2 డయాబెటిస్ కూడా ప్యాకేజ్ ఫుడ్ కారణంగా వస్తుందని తెలుస్తుంది. పిల్లల్లో అధిక బరువు సమస్య వస్తుందని చెబుతున్నారు. ప్యాకేజ్ ఫుడ్ వినియోగం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.