Family: సమాజంలో కుటుంబ వ్యవస్థ అనే పునాదుల మీద నిలబడి నడుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ కుటుంబాల కారణంగానే బంధాలు, అనుబంధాలు మనుషుల మధ్య ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయత, నలుగురితో కలిసి బ్రతికే తత్త్వం ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇండియాలో బలంగా ఉండేది. ప్రాచీన నాగరిక ప్రపంచంలో చాలా దేశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే జీవనం సాగించాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా కుల వృత్తులు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకడం వలన అందరూ కలిసి పనిచేసుకొని వచ్చిన దాంతో సంతోషంగా బ్రతికేవారు.
అయితే ఎప్పుడైతే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వ్యవసాయాన్ని వదిలేసి బ్రతకడం కోసం ఇతర వృత్తులలోకి వెళ్ళడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మెల్లగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవుతూ వస్తున్నాయి. ఉద్యోగాల వేటలో, బ్రతుకు కోసం ఆడే ఆటలో సొంత ఊరిని, కన్నవాళ్ళని వదిలేసి దూర ప్రాంతాలకి వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి కుటుంబంలో ఉన్న బంధాలు, బంధువుల మధ్య అంతరం పెరగడం మొదలైంది. కలిసి ఉండాలంటే వంద కారణాలు కావాలి. దూరంగా ఉండటానికి, బంధాలని వదులుకోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు.
ఇంత వరకు భాగానే ఉంటుంది. కాని వారు తీసుకున్న నిర్ణయాలలో తన కుటుంబంలో, ఆ కుటుంబం బంధంలో ఉన్న అందరూ ఉండరు కాబట్టి వారికి ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటారు. వారి ఇష్టానికి లోబడే మాట్లాడుతారు. అయితే కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలు కుటుంబంలో మిగిలిన వారికి నచ్చకపోవచ్చు. ఎవరికి వారు తమకి ఉపయోగం ఏంటి అనే కోణంలోనే ఆలోచించడం వలన ఒక్కోసారి ఆశలు తీరవు. అప్పుడే అభిప్రాయ బేధాలు మొదలవుతాయి. విభేదించడం మొదలు పెట్టి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడుతారు. ప్రతి ఒక్కరికి ప్రస్తుత సమాజంలో ఇగో అనేది ఉంటుంది.
అ ఇగో ఒకప్పుడు నా వాళ్ళు అంటూ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముల్లు అందరూ ఉండేవారు. అయితే ఆ ఇగోలో కేవలం నా వాళ్ళు అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనేది మాత్రమే ఉంటుంది. ఇక్కడే ఇగోలు హార్ట్ అయినపుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే వరకు వెళ్ళిపోతారు. ఆ ఇగో హార్ట్ అవడానికి ఒక్క మాట చాలు. అందుకే అంటారు పదిమందిలో మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలి. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా. నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా. నేను చాలా ఫ్రాంక్ గా ఉంటా. ముక్కుసూటిగా మాట్లాడుతా అనే మాటలు చాలా మంది నోటి నుంచి వినబడతాయి.
కాని ఉమ్మడి కుటుంబాలలో బంధాలు నిలబడ్డాయి అన్నా, గ్రామాలలో ఒకరికి ఒకరు అన్నట్లు అందరూ కలిసిమెలిసి పండగలు, శుభకార్యాలు చేసుకునే వారన్నా కేవలం లౌక్యంగా మాట్లాడి. నొప్పించక, తానొవ్వక అన్నట్లు మాట్లాడటమే. అలాగే అందరి వ్యక్తిగత అభిప్రాయాలకి గౌరవం ఇవ్వడమే. అలాగే ఒకరు ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఉన్నవారు ఉన్న కూడా వారు ఆడే మాటకి ఇగోకి పోకుండా ఆలోచించి అర్ధం చేసుకునే అలవాటు ఉండటమే. అయితే ఈ రోజుల్లో ఎదుటివారు అన్న మాట కాస్తా కఠినంగా ఉండే తీసుకునే తత్త్వం కాని, ఆలోచించే మనస్తత్వం కాని ఎవరికి లేవు.
నువ్వు ఒక మాట అంటే నేను పది మాటలు అంటా అనే విధంగానే అందరూ ఉన్నారు. ఈ కారణంగా బంధాలు విచ్చిన్నం అవుతూ ఉన్నాయి. కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. అపార్ధాలతో దూరం అయిపోతున్నారు. ఆవేశాలకి పోయి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ ఆగాలన్నా, మారలన్నా ఒక్కటే పరిష్కారం. ఆ ఒక్క మాటని ఆలోచించి మాట్లాడితే చాలు. ఆ ఒక్క మాటని ఆవేశ పడి అనకుండా ఉంటే చాలు. ఆ ఒక్క మాటకి ఇగో హార్ట్ చేసుకోవడం మానేస్తే చాలు. ఆ ఒక్క మాటని క్షమించేస్తే చాలు.
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
This website uses cookies.