NTR-Trivikram : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన వార్తలే హల్చల్ చేస్తూ ఉన్నాయి. దేవర గురించి అప్డేట్స్ తో పాటు తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా రకరకాల వార్తలు,రూమర్స్ నెట్టింట్లో వినిపిస్తూ, కనిపిస్తూ ఉన్నాయి. ఒకరకంగా న్యూస్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు ఎన్టీఆర్. ఓవైపు దేవర సినిమా పోస్టు పోన్ అయ్యిందంటూ వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్ పెద్ద షాక్ లో ఉన్నారు. ఇది చాలా అన్నట్లు ఇప్పుడు మరో షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గుంటూరు కారం ఎన్టీఆర్ చేయాల్సిందట తృటిలో తప్పిపోయింది. లేదంటే భారీ ఫ్లాపును ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకునేవాడు. ఇంత పెద్ద షాక్ నుంచి తప్పించుకున్న తర్వాత కూడా మళ్లీ మాటలు మాంత్రికుడు తో సినిమా ఎలా అంటే..ఇదుగో ఇలా ..
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్ కి చేరుకుంది. ఫ్యాన్ ఇండియన్ లెవెల్ లో ఎన్టీఆర్ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. నిజానికి ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. కొన్ని రోజులు వీరిద్దరూ కలిసి ట్రావెల్ కూడా చేశారు. గుంటూరు కారం కథను ఎన్టీఆర్ కు చెప్పారు త్రివిక్రమ్. అయితే ఆ స్టోరీ ఎన్టీఆర్ కు పెద్దగా నచ్చలేదట. ఆ తర్వాత రెండు మూడు స్టోరీలు చెప్పినా అవి నచ్చకపోవడంతో ఎన్టీఆర్ డ్రాప్ అయ్యాడు ప్రస్తుతం తారక్ దేవర మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమా పూర్తి కాగానే హృతిక్ రోషన్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్లో పాల్గొనను ఉన్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో డెబ్యూ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు వెయిటింగ్ లో ఉంది. ఇదే సమయంలో మాటల మాంత్రికుడితో సినిమా అనేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గతంలో త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో అజ్ఞాతవాసి మూవీ తీశారు. అయితే ఈ సినిమా హిట్ అందుకోకపోగా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. సినిమా ఫ్లాప్ అవడంతో అందరూ త్రివిక్రమ్ నే అన్నారు. గురూజీ పనైపోయింది ఇక సినిమాలు తీయడం ఆపేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ ను దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో హర్ట్ అయిన త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చాడు. దీంతో ఎలాగైనా హిట్ సాధించాలని ఉద్దేశంతో అరవింద సమేత మూవీ తీశాడు. బట్ ఈ సినిమా అనుకున్నంత భారీ హీట్ అయితే కాలేదు. అందుకే త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు.
అప్పుడు అజ్ఞాతవాసిలా ఇప్పుడు గుంటూరుకారం తో త్రివిక్రమ్ డిజాస్టర్ చూశాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కావడంతో అందరూ త్రివిక్రమ్ నే తిట్టుపోస్తున్నారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ అయితేనే త్రివిక్రమ్ కు సక్సెస్ అందించగలడన్న టాక్ వినిపిస్తోంది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పుడున్న ఎన్టీఆర్ రేంజ్ కు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా? ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా త్రివిక్రమ్ ఇప్పట్లో అయితే సినిమా చేసే అవకాశం లేదు. ఎందుకంటే వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. మరి భవిష్యత్తులో అయినా ఆఫర్ అందుకుంటాడో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.