Niharika Konidela : నిహారిక కొణిదెల ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఏకైక నటి నిహారిక. పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో తన సినీ జర్నీని స్టార్ట్ చేసిన నిహారిక హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో స్టార్డమ్ సంపాదించుకోలేకపోయింది ఈ చిన్నది. సినిమాల కన్నా నిహారిక తన పర్సనల్ లైఫ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. చైత్యన జొన్నలగడ్డను పెళ్లి చేసుకోవడం దగ్గరి నుంచి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడం వరకు అంతా కూడా సోషల్ మీడియా లో సెన్సేషనల్ న్యూసే. ఇక డివోర్స్ తర్వాత నిహారిక నెట్టింట్లో మరింత యాక్టివ్ అయ్యింది. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది మెగా డాటర్ అంతే కాదు యాంకర్‌గా ఓ షో హోస్ట్ చేస్తుంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ.. నిర్మాతగా బిజీ అయ్యింది నిహారిక.
సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వస్తున్నా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది నిహారిక. నిజానికి వాటన్నింటిని పట్టించుకోకుండా తన లైఫ్ ను ఫ్యామిలీతో , ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడు ఖాళీ దొరికినా వారితో సమయం గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు ఏనుగులు ముఖాన్ని దగ్గరగా పెట్టుకుని ఓ జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారో అలా కనిపిస్తున్న ఓ పిక్ ను నిహారిక నెట్టింట్లో షేర్ చేసింది. ఆ పిక్ కు రెడ్ హార్ట్ సింబల్ ను కూడా జత చేసింది. ఈ ఫోటో స్టోరీ నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట పైనే తెగ చర్చించుకుంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పరేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇస్తున్నారు. నిహారికకు ఏనుగులు అంటే ఇష్టం అని అంటున్నారు. అందుకే ఏనుగుల ఫొటోను షేర్ చేసిందేమో అని అంటున్నారు. ఈ మధ్యనే నిహారిక ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి నేచర్ టూర్ వెళ్లింది. అక్కడ ఏనుగులతో టైం పాస్ చేసింది. ఆ వీడియోలను కూడా నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.