NBK 109: 10 కోట్లా 5 కోట్లా..ముల్లు దిగేది ఎటువైపు..? అంటూ తాజాగా సెట్స్ పైకి వచ్చిన ఎన్‌బీకే 109 గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సినిమా మొత్తం ఆయన భుజాలపై మోసి ప్రశంసలు అందుకున్నారు.
భగవంత్ కేసరి లాంటి సినిమా ఒప్పుకోవాలంటే అది బాలయ్యకే సాధ్యమని చెప్పుకున్నారు. రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా ఆయన వయసుకి తగ్గట్టు కథలు ఎంచుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు, సినీ లవర్స్ గొప్పగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలయ్య తన 109వ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. మంచి ఫాంలో ఉన్న బాబి ఈ సినిమాకి దర్శకుడు.
బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మాస్ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా మెగాస్టార్, రవితేజలకి సాలీడ్ హిట్ ఇచ్చింది. అదే జోష్‌లో బాబి,,బాలయ్యతో తన నెక్స్ట్ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. షూటింగ్ మొదలుపెట్టిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను వదిలారు. గొడ్డలి, దానికి గాగూల్ పెట్టి “బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్”..అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దీనిని బట్టి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది తేలలేదు. అనిరుధ్ రవిచందర్ ని సంప్రదించగా 10 కోట్లు అడిగినట్టు తెలుస్తుంది. కానీ, ఈ రెమ్యునరేషన్ దర్శకుడు బాబీ కంటే ఎక్కువ. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అయితే 5 కోట్లు అందుకుంటున్నారు. ఇది మేకర్స్ కి ఎఫర్టబుల్. బాలయ్య, దేవీ, బాబీ-దేవీ కాంబోలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కాబట్టి దేవీకే ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండూ ఆప్షన్స్ కాకపోతే ఇప్పటికే బాలయ్యతో ట్యూన్ అయిన థమన్ కి ఛాన్స్ ఇవ్వొచ్చు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.