Nayanthara : లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్క్రీన్ మీద ఈ బ్యూటీ కనిపిస్తే కలెక్షన్ల మోత మోగాల్సిందే. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి లేని పాపులారిటీ నయనతార సొంతం. ఆమె అందమే కాదు నటన కూడా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు స్టార్డమ్ తగ్గుతున్నప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ నయన్ విషయంలో మాత్రం అలా కాదు ఈ బ్యూటీ గత కొన్ని ఏళ్లుగా తన క్రేజ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. పెళ్లయిన తర్వాత కూడా అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే షారుఖ్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ కావడంతో అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
మరి నయన్ తన కెరీర్ లో ఇంత సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం భర్త విఘ్నేష్ అని చెప్పి తీరాల్సిందే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్లే నయన్ విజయం వెనకాల విఘ్నేష్ ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలో నాయన్ కి తన ఫుల్ సపోర్ట్ ని అందిస్తున్నాడు విఘ్నేష్. అందుకే ఓవైపు ఫ్యామిలీ పిల్లలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. ఇటీవలె నయన్ బర్త్ డే సందర్భంగా తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు విఘ్నేష్.
ఆమెకు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. అయితే బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తయిన రెండు వారాల తర్వాత తన భర్త ఇచ్చిన బహుబతి గురించి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది నయనతార. ఇంతకీ ఆ బహుమతి ఏంటో తెలుసా? జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్. ఈ కారుని అక్షరాలా రూ. 3 కోట్లు పోసి కొని నయన్ కు గిఫ్ట్ ఇచ్చాడు. లేటెస్ట్ గా కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
‘వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. కారుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేసింది నాయనతార. మై నా ప్రియమైన భర్త, మధురమైన పుట్టినరోజు కానుకను ఇచ్చినందకు థ్యాంక్యూ. లవ్ యూ అంటూ’ విఘ్నేష్ పై ప్రేమను కురిపించింది .ఈ పోస్ట్ నెటిజన్లను, నయన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కంగ్రాట్స్ అంటూ ఫాలోవర్స్ విషెస్ చెబుతున్నారు.విఘ్నేష్ నయన్ కు బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన కారు ధర రూ. 3.40 కోట్లు ఉంటుందని అంచనా.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.