Nayanathara : న్యూస్ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నటి నయనతార. మొదట బొద్దుగా ఉండటంతో ఈమె సినిమాలకు పనికిరాదని చాలా మంది ఎగతాలి చేశారు. కానీ నయన్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుని ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపేస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ మలయాళ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది నయన్. అంతే కాదు హీరోల అవసరం లేకుండా లేడీ ఓరియెంటెడ్ సోషల్ మెసేజ్ సినిమాలతో థియేటర్లను కొల్లగొడుతోంది. ఈ భాయ నటించిన దదాపు అన్ని సినిమాను బాక్సాఫీస్ ను షేక్ చేసాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హీరోలతో నయన్ సాగించిన ప్రేమాయణం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటూ వచ్చేది. అయితే ఎట్టకేలకు తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లైంది నయన్ అయినా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది.
ఇదిలా ఉంటే నయన్ మొదటి నుంచి మీడియాకు దూరంగా ఉండేది. ఆమె నటించిన సినిమా ప్రమోషన్లకు సైతం అటెండ్ అయ్యేది కాదు. ఒకసారి సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందంటే ఎక్కడా పెద్దగా కనిపించేది కాదు. నిన్న మొన్నటి వకు సోషల్ మీడియాలో కూడా లేదు. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన నయన్ చాలా వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉంటూ వచ్చేది. కానీ గత కొంత కాలంగా తనకు తన భర్తతో విభేదాలు ఉన్నాయని, విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ రూమర్ జోరుగా వైరల్ అవుతోంది. దీంతో దెబ్బకు నయన్ తన భర్తతో, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేం కలిసే ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా నయన్ ను నిర్మాతలు రప్పించలేక పోయేవారు కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ తో నయన్ ను ఒక రేంజ్ లో భయపెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేలా చేస్తున్నారు అనే కామెంట్లు ఇప్పుడు వకనిపిస్తున్నాయి. తాజాగా నయన తార తన భర్త పిల్లలతో ఉన్న కొన్ని ఫోటోలను కూడా చేర్ చేసి అభిమానులను ఖుషీ చేసింది.
ఇదిలా ఉంటే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క భర్తతో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తోంది. అదే విధంగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఇతర సంస్థలు రూపొందించిన సినిమాలను రిలీజ్ చేస్తోంది. అలా ఈ మధ్యనే విడుదలైన ‘కూళంగల్’ అనే మూవీ మరో అవార్డు నిసొంతం చేసుకుంది. గ్రామీణ ప్రజల జీవన విధారారంరి దర్శకుడు పీఎస్.వినోద్‌రాజ్ ఈ మూవీలో ఆవిష్కరించారు. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు అవార్డులను సైతం మేకర్స్ అందుకున్నారు.
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
This website uses cookies.