Nayanatara : లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ ఏమిటో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా అమ్మడి క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అందుకే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో నయన్ ఛాన్స్ కొట్టేసింది. తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దుమ్ము దులిపేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టింది. కలెక్షన్ల సునామీని సృష్టించింది. వరుసగా హిందీ సినిమాలు దివాలా తీస్తున్న తరుణంలో జవాన్ సినిమా బాలీవుడ్ కి ఊపిరి పోసింది. అంతా బాగున్నా నయనతర మాత్రం డైరెక్టర్ అట్లీ పై ఫుల్ ఫైర్ అవుతున్నారట. అతను చేసిన పనికి ఓ రేంజ్ లో ఇచ్చి పడేసారట. ఇంతకీ అట్లు ఏం చేశాడు నాయన్ ఆగ్రహానికి ఎందుకు గురయ్యాడో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, నయన తార, దీపిక పదుకొనె, విజయ్ సేతుపతి, తదితర బాలీవుడ్ కోలీవుడ్ నటులు నటించిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన జవాన్ సినిమా.. భారీ వసూళ్లతో రికార్డులను తిరగ రాసింది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ లో నయన్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీపిక కూడా కీ రోల్ పోషించింది. ఆమె పాత్ర కథకు మంచి బలాన్నిచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. జవాన్ లో నయన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ విషయంలో డైరెక్టర్ అట్లీపై నయన్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీపిక గెస్ట్ రోల్ లో కనిపించినా ఆమెకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అట్లీ దెబ్బకు ఇకపై బాలీవుడ్ లో నయన్.. నటించకూడదని డిసైడ్ అయ్యిందట.అందుకే జవాన్ ప్రమోషన్స్ లోనూ ఈ బ్యూటీ ఎక్కడ కూడా కనిపించలేదు. దీనితో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. షారుఖ్- నయన్ జవాన్ కాస్త.. దీపిక-షారుఖ్ జవాన్ గా మారిందని సినీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నారట . అంతెందుకు లాస్ట్ వీక్ ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో సౌత్ నుంచి విజయ్ తో సహా అందరు హాజరైనా నయన్ మాత్రం సైడ్ అయ్యింది. అయితే ఈ వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. నాయన్ జవాన్ మాత్రమే కాదు ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లలేదని, కొన్ని కారణాల వల్ల ఆమె ప్రచారాలకు దూరంగా ఉంటుందని చెప్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.