Categories: Tips

Health Tips: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా కారణం ఇదే కావచ్చు.. నిర్లక్ష్యం వద్దు?

Health Tips: రోజురోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యం కారణంగా అనేక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కుదిబ్బడ, ముక్కు కారడం వంటి సమస్యలు తలెత్తి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి. గాలి కాలుష్యం, తడి వాతావరణం కారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా , వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ముక్కు లోపలి పొరను ఇన్ఫెక్షన్ కు గురిచేసి తీవ్రమైన నొప్పి ,వాపును కలగజేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది కలగవచ్చు.

శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తరచూ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ముక్కు లోపలి పొరలో వాపు వచ్చి కొయ్య కండలు పెరుగుతాయి. అధిక జ్వరం, జలుబు సమస్యతో ఎక్కువ రోజులు బాధపడితే ముక్కు లోపల కండరాలు పెరుగుతాయి. దీంతో తరచూ ముక్కులో నీరు కారడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. వాసన గ్రహించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. తరచూ తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ముక్కు లోపలి పొరలు దురద, మంట  వంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని వేధిస్తాయి.

జలుబు లేకపోయినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే ముక్కు లోపలి పొరలో పాలిప్స్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సైనస్ సర్జరీతో పాలిప్స్ ను  తొలగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలుగుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు శీతాకాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. బయటి వాతావరణంలో తిరిగేటప్పుడు గాలి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి తరచూ మాస్కులు తప్పనిసరిగా వాడాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించకుంటే ఈ సమస్య మళ్లీ మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.

Sravani

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

5 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

5 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

5 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.