Yuvagalam: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఏపీ రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ మొదటి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అనే హోదాని మాత్రం సొంతం చేసుకోగలిగారు. పార్టీకి అన్నితానై బలమైన టీమ్ ని తయారు చేసుకున్నాడు. వారితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిణితి చెందే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పై ప్రత్యర్ధులు పప్పు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే తన రాజకీయ పరిణితిని పెంచుకోవడంతో పాటు నాయకుడిగా తనని తాను ప్రాజెక్ట్చేసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్రని ఎంపిక చేసుకున్నారు.
అయితే లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పినపుడు కనీసం రెండు జిల్లాల్లో కూడా తిరగలేడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కొంటూనే తన ప్రయాణం మొదలు పెట్టారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ వంద రోజుల యాత్రని పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో చాలా జిల్లాలు ఇప్పటికే కవర్ చేశారు. ఇక నారా లోకేష్ పాదయాత్రని అధికార పార్టీ వైసీపీ ఆరంభంలో లైట్ గా తీసుకున్న తర్వాత పద్ధతి మార్చారు. లోకేష్ పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై విమర్శలు చేయడంతో అవి పార్టీ మైలేజ్ ని దెబ్బతీస్తున్నాయని ఎదురుదాడి మొదలు పెట్టారు.
ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉండటంతో ప్రజలలో లోకేష్ ఆదరణ మరింత పెరుగుతూ పోతోంది. బలమైన నాయకుడిగా చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే వ్యక్తిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో, పార్టీ క్యాడర్ కి నమ్మకం కలిగించడంలో లోకేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఒక వేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా నారాలోకేష్ పాదయాత్ర బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. అలాగే క్యాడర్ కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.