Nandamuri Fans: నందమూరి హీరోల నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనే విషయం మిగిలిన ఆడియన్స్ కంటే ఆ హీరోలకి భాగా తెలుసని చెప్పాలి. నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ ప్రస్తుతం ప్రేక్షకులని రెగ్యులర్ గా ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు హీరోల నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ కథలని మాత్రమే కోరుకుంటున్నారు అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. దీనికి వారి నుంచి వచ్చే సినిమాలని కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహానాయుడు తర్వాత మరల ఆ స్థాయిలో హిట్ అందుకోవడానికి చాలా సమయం పట్టింది.
అయితే ఆ సమయంలో బాలకృష్ణ చేసిన సినిమాలు చాలా వరకు యాక్షన్ ఎలివేషన్ టైటిల్స్ కాకపోవడం కూడా బాలయ్య వరుస డిజాస్టర్స్ కి కారణం అనే మాట వినిపిస్తుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత సింహ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తర్వాత శ్రీరామరాజ్యం, శ్రీమన్నారాయణ వరకు అన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీనికి కారణం టైటిల్స్ లో మాస్ వైబ్రేషన్ లేకపోవడమే. తరువాత మరల లెజెండ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ మళ్ళీ వరుసగా లయిన్, డిక్టేటర్, పైసా వసూల్, గౌతమిపుత్రా శాతకర్ణి సినిమాలతో హిట్స్ ని ఖాతాలో వేసుకున్నారు.
అయితే మళ్ళీ అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాల క్రమం చూసుకుంటే టైటిల్స్ లో మాస్ వైబ్రేషన్ ఉన్న సినిమాలే ఎక్కువగా బాలకృష్ణకి హిట్స్ గా వచ్చాయి. ఇక ఎన్టీఆర్ కి కూడా అదే స్థాయిలో మాస్ వైబ్రేషన్ ఉన్న కథలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. జైలవకుశ సినిమా సెన్సేషన్ హిట్ కావడానికి మాస్ వైబ్రేషన్ టైటిల్ తో పాటు ట్రైలర్ కూడ కారణం అయ్యింది.
ఇక కళ్యాణ్ రామ్ విషయంలో కూడా ఇదే ఫీట్ రిపీట్ అయ్యింది. అతని కెరియర్ లో వచ్చిన అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలు కంప్లీట్ మాస్ యాక్షన్, లేదా మాస్ ఎంటర్టైనర్ కథలతో వచ్చినవే కావడం విశేషం. తాజాగా వచ్చిన అమిగోస్ సినిమా బాగుంది అనే టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. దీనిని బట్టి నందమూరి ఫ్యాన్స్ తమ హీరోల నుంచి మాస్ కథలనే ఎక్కువగా కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.