Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున తాజాగా “ఆరోజు బీరు తాగి, బిర్యాని తిన్నా..అప్పుడే ఆ ఆలోచన వచ్చింది..అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగార్జున ఎందుకు ఇలా మాట్లాడారు..అసలు విషయం ఎంటో కథనంలోకి వెళ్ళి తెలుసుకుందాం. కెరీర్ ప్రారంభంలో నాగార్జునకి సరైన హిట్స్ లేవు. ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని హిట్స్ అందుకుంటూ వచ్చారు.
శివ నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ ఓ మైల్ స్టోన్‌లా మిగిలిపోయే సినిమా. ఆ తర్వాత నాగార్జున వరుసగా మంచి హిట్స్ అందుకున్నారు. కమర్షియల్ హీరోగా కెరీర్ ఊపులో ఉండగానే ఎవరూ ఊహించని విధంగా అన్నమయ్య సినిమా చేయడం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున ఎన్నో నెగిటివ్ కామెంట్స్ విన్నారు. అయినా రాఘవేంద్ర రావు మీద నమ్మకంతో అన్నమయ్య చేసి కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేరేమో అనే మంచి కామెంట్స్ అందుకున్నారు.
అన్నమయ్యగా నాగార్జున చేసిన పర్ఫార్మెన్స్ మహాద్భుతం. ఆ తర్వాత శిరిడి సాయి సినిమా చేశారు. అయితే, ఈ సినిమా చేయాలనే ఆలోచన మాత్రం ముందు వచ్చింది నాగార్జునకేనట. సోమవారం నుంచి శనివారం వరకూ నాగార్జున తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అన్నీ లిమిట్‌గా తీసుకుంటారు. ఒక్క ఆదివారం మాత్రం నాగార్జునని ఎవరూ ఆపలేరు. ఆ ఒక్కరోజు మాత్రం ఆయనకి నచ్చిన తిండి నచ్చినంత తింటారు. అలాగే ఒక ఆదివారం బిర్యానీ తిని ఫుల్లుగా బీరు తాగి ఉన్నారట.
ఆ సమయంలో నాగార్జునకి శిరిడి సాయిబాబా పాత్రలో నటించాలనే ఆలోచన కలిగిందట. అదే మాట దర్శకుడు రాఘవేంద్ర రావుకి చెప్తే ఆయన కూడా సరే అని చెప్పారట. ఆ తర్వాత నాగార్జున శిరిడీకి వెళ్ళి సాయిబాబాని దర్శించుకొని రావడం, శిరిడి సాయి సినిమా చేయడం జరిగాయని నాగార్జున చెప్పారు. ఈ భక్తి ప్రధానమైన చిత్రం చేయడానికి అసలు నాగార్జున ఏ సమయంలో డిసైడయ్యారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.