Nagababu: ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారని సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ పై నాగబాబు రియాక్ట్ అయ్యి ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాస్త ఘాటుగానే తమ్మారెడ్డిని ఉద్దేశించి నాగబాబు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై మరల తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అవుతూ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వకుండా నాగబాబుపై ఎదురు దాడి చేశారు. సంబంధం లేకుండా రాజకీయపరమైన అంశాలను తెరపై తీసుకొచ్చి నాగబాబుపై తమ్మారెడ్డి విమర్శలు చేశారు. అలాగే నాగబాబు అన్న మాటలు పట్టుకుని దాన్ని తిప్పి తిప్పి మరల తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ గొడవ పక్కకి వెళ్లిపోయి ఇప్పుడు నాగబాబు తమ్మారెడ్డి మధ్య వ్యక్తిగతంగా వైరంగా ఇది మారిపోయింది.
ఇదిలా ఉంటే మరల తాజాగా నాగబాబు తమ్మారెడ్డి విమర్శలకు తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఆస్కార్బర్లో మన తెలుగు సినిమా ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వపడాలని నాగబాబు అన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే ప్రతి తెలుగోడు తలెత్తుకొని చెప్పుకోవాల్సిన అంశంగా ఉంటుంది అని తెలిపారు. ప్రతి భారతీయుడుగా ఈ విషయంలో మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉన్నందుకు కుళ్ళు కొని చచ్చిపోవడం ఎందుకు. మెచ్చుకోవడం అనే సంస్కారం కొంతమందికి లేకపోవచ్చు. సినిమాలు మానేసి ప్రొడక్షన్ నుంచి బయటకు వచ్చి రిటైర్మెంట్ తీసుకున్న బ్యాచ్ మనది.
మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కెమెరా కనిపిస్తే పెద్ద విశ్లేషకుడి మాదిరిగా, మేధావిలా మాట్లాడితే జనం క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాడు. అసలు నువ్వు తీసిన సినిమాలేంటి అందులో ఎన్ని హిట్ అయ్యాయి. నువ్వు నటులకు అసలు రెమ్యూనరేషన్ ఇచ్చావా. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంటాయి. ఇప్పటికే రాజకీయాలు చేస్తూ పనికిమాలిన విమర్శలు అన్ని చేసావు. వాటిని పట్టించుకోలేదు మళ్లీ సంస్కారం అంటూ ఏదో గొప్పగా మాట్లాడుతున్నావ్. నీకు సంబంధం లేకపోయినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతావా. మాకు చేతకాదా… రాజకీయంగా ఇప్పటికే చాలా విమర్శలు చేసావ్. తెలుగువారీగా గర్వపడాల్సిన సినిమా విషయంలో కూడా ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నావు. రాజమౌళి దీనిపైన రియాక్ట్ కాకపోవచ్చు. కానీ మేము రియాక్ట్ అవుతాం అంటూ నాగబాబు తమ్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.