Naga Chaitanya : సమంతతో విడాకుల తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ పై దృష్టి పెట్టాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో గత కొంత కాలంగా చై, నటి శోభితా ధూళిపాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు చైతూ శోభితతో డేటింగ్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.ఆ 8తతతమధ్యలో వీరిద్దరూ కలిసి హాలిడే వెకేషన్ కు కూడా వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ మధ్య ఈ ఇద్దరూ రూమర్డ్ కపుల్ లండన్ కు వెళ్లి ఫోటోల్లో కనిపించింది. లండన్ టూర్ లో భాగంగా ఓ భారతీయ రెస్టారెంట్ కు వెళ్లిన చైతన్య ఓ చెఫ్ ఫోటో దిగాడు. ఆ ఫోటోను చెఫ్ నెట్టింట్లో షేర్ చేశాడు. అయితే అదే ఫోటోలో శోభితా ధూళిపాళ్ల కూడా కనిపించింది. సోషల్ మీడియాలో ఆ పిక్ దుమారం లేపింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ కావడంతో చెఫ్ ఆ పిక్ ను తీసేశాడు. దీంతో చైతూ, శోభిత రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి.
లేటెస్టుగా మరోసారి వీరిద్దరూ కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా చైతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పిక్ పోస్ట్ చేశాడు. సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్నా అని ఆ పిక్ కింద క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ చేసిన క్షణాల్లోనే శోభిత లైక్ కొట్టింది. దీంతో నెటిజన్స్ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పక్కాగా చెబుతున్నారు. ఆ ఫోటో శోభితే తీసిందని, ఇద్దరూ సమ్మర్ వెకేషన్ లో ఉన్నారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శోబిత కూడా ఈ మధ్య వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్లింది. దానికి సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. చైతన్య పోస్ట్ చేసిన పిక్ కూడా సఫారీ చేస్తున్నప్పుటిదే కావడంతో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. దీంతో వీరిద్దరి ఫోటోలు మిక్స్ చేసి నెట్టింట పోస్ట్ నెటిజన్లు దొరికేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మహారాష్ట్రలోని వైల్డ్ లైఫ్ రిసార్ట్ కు వీరిద్దరూ వెళ్లినట్లు నెటిజన్స్ చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో చైకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారుల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు చందూ. ఈ మూవీ షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చి తమ్ముడు, అక్కినేని అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లి ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత శోభితతో సమ్మర్ వెకేషన్ కు వెళ్లినట్లు ఇండస్ట్రీలో నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా లేదా రూమరా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.