Kalki Glimpse : సలార్ సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అన్నీ భాషలు వచ్చేలా ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ బాలుడు అడిగిన ప్రశ్నకు ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వద్దామను అంటూ అమితాబ్ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది. అంతే కాదు ఈ ఒక్క వీడియోలో అమితాబ్ ను రెండు రకాలుగా చూపించాడు డైరెక్టర్.
మహానటి సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా హిట్ తో మరో అదిరిపోయే కథతో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి కల్కి 2898AD సినిమా తీస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, అందాల ముద్దుగుమ్మ దిశా పటాని, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కీ మూవీ చివరిదశలో ఉంది . ఈసినిమాను మే 9న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే కల్కి నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్,టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. హిందూ మైథలాజి స్టోరీతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఎప్పడెప్పుడు ట్రైలర్ వస్తుందా.. ? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్ళుగా కష్టపడుతున్నారు. ప్రతి సీన్ ను డీప్ గా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త వరల్డ్ ను డైరెక్టర్ సృష్టించాడని తెలుస్తోంది. ప్రేక్షకులను ఈ ప్రపంచం మెప్పిస్తుందని ఈ మధ్యనే డైరెక్టర్ కూడా ధీమాను వ్యక్తం చేశాడు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.