Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి ట్రెండ్‌ను ఆయన ఫాలో అవుతుంటారు. అంతే కాదు ఫ్యాన్ వార్‌లను కూడా చాలా శ్రద్దగా గమనిస్తుంటారు నాగబాబు. ఎవరేం అనుకుంటున్నారు.. ఎవరెలా రెస్పాండ్ అవుతున్నారో పరిశీలిస్తుంటారు. అప్పుడప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వివాదాలకు కారణమవుతుంటారు. ఈ క్రమంలో నాగబాబు రీసెంట్ గా ఏపీ ఎన్నికల తర్వాత ఓ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. మావాడైనా పరాయివాడే.. పరాయి వాడైనా మా వాడే అంటూ ఓ నోట్ రాశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇలా ట్వీట్ వేశాడో లేదు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేశాడు అన్నది మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు.కానీ కొంత మంది అది అల్లు అర్జున్ గురించే అంటూ కామెంట్స్ రాయడంతో ఆ ట్వీట్ పై మళ్లీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.
నాగబాబు ట్వీట్ తో రెండు రోజులు మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్ జరిగింది. అల్లు రామలింగయ్య లేకపోతే మెగా బ్రదర్ లేడు అనే స్థాయికి ట్రోలింగ్ జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందినవాడై ఉండి వైసీపీ క్యాండిటేడ్ కు బన్నీ ప్రచారం చేశాడు కాబట్టి.. నాగబాబు అలా అన్నాడు అంటూ నెటిజన్స్ తీర్మానించేసుకుని నెట్టింట్లో ట్రోలింగ్‌కు ఎగబడ్డారు. మరి ఈ ట్రోలింగ్ చూసో లేక ఈ బురద మనకెందుకు అని అనుకున్నాడు కాబోలు ఆ ట్వీట్ ని డిలీట్ చేసి అకౌంట్ ను డీ యాక్టివ్ చేశారు. మా దెబ్బకు భయపడ్డాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దీనికి వైసీపీ కార్యకర్తలు కూడా వంత పాడారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు మళ్లీ ట్విట్టర్‌లోకి ఎంటర్ అయ్యారు. నేను ఆ పోస్ట్ డిలీట్ చేశానంటూ మళ్లీ ట్వీట్ వేశాడు. దీంతో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.