Na Roja Nuvve Song lyrics (kushi Movie) : నా రోజా నువ్వే సాంగ్ వైరల్ అవడానికి కారణం ఇదే

Na Roja Nuvve Song lyrics (kushi Movie) : ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ సినీ లవర్స్, సమంత-విజయ్ దేవరకొండ ల డైహార్ట్ ఫ్యాన్స్ అదే పనిగా వింటున్న సాంగ్ ఖుషి సినిమాలోని నా రోజా నువ్వే. అద్భుతమైన మెలోడి సాంగ్. ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజై ఇప్పటికే చాలా రోజులైంది. 10 మందిలో 9 మంది ఇదే సాంగ్ వింటున్నారు హమ్మ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలాందికి ఈ సాంగ్ లిరిక్స్ మొత్తం వచ్చేసింది. ఓ పాయిజన్ లా ఈ సాం జనాలకి ఎక్కడానికి కారణం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పదాలు అద్భుతం అని చెప్పాలి. పల్లవి, చరణాలలో ఆ పదాల అమరిక రెండు హృదయాలను పెనవేసినట్టు తెలుస్తుంది.

సాధారణంగా ఇంత అర్థవంతంగా ఉండే పాటలు గత కొంతకాలంగా మన తెలుగు సినిమాలలో వినిపించడం లేదు. మణిరత్నం సినిమాలలోని పాటలాగా, ఇళయరాజా, ఏ ఆర్ రెహమాన్ లాంటి వారు సంగీతం అందించినంత గొప్పగా ఈ పాటకి సంగీతం కుదరడం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఒకసారి ఈ పాటలోని పల్లవి, చరణాలను చూద్దాం.

na-roja-nuvve-song-lyrics-kushi-movie-

ఆరా…ఆరా…ఆరా…

తననననా..తననననా

పల్లవి:

ఆరా సే ప్యారూ..అందం తన ఊరు..

సారే హుషారు..బేగం బేజారూ..

ఆరా సే ప్యారూ..అందం తన ఊరు..

దిల్ మాంగే మోరూ..ఈ ప్రేమే వేరూ..

హుక్‌లైన్ 1

na-roja-nuvve-song-lyrics-kushi-movie-

నా రోజా నువ్వే…తననననా.. నా దిల్సే నువ్వే..తననననా

నా అంజలి నువ్వే..తననననా.. గీతాంజలి నువ్వే..తానననా

నా రోజా నువ్వే..నా దిల్సే నువ్వే..తననననా

నా అంజలి నువ్వే..తననననా… గీతాంజలి నువ్వే..తానానానా

చరణం 1:

నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంట..

ఓకే బంగారం..ఉమ్ ఉమ్ ఉమ్..

na-roja-nuvve-song-lyrics-kushi-movie-

హుక్‌లైన్ (R)

నా రోజా నువ్వే…తననననా.. నా దిల్సే నువ్వే..తననననా

నా అంజలి నువ్వే..తననననా.. గీతాంజలి నువ్వే..తానననా

నా రోజా నువ్వే..నా దిల్సే నువ్వే..తననననా

నా అంజలి నువ్వే..తననననా… గీతాంజలి నువ్వే..తానానానా

చరణం 2:

నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా..

నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా..

నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో..

నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంట..

ఓకే నా బేగం..

na-roja-nuvve-song-lyrics-kushi-movie-

పల్లవి (R):

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..

హుక్‌లైన్ (R) :

నా రోజా నువ్వే…

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

సాంగ్ మొదలవడమే చాలా ఆహ్లాదకరంగా మొదలైంది. ఇక్కడే మ్యూజిక్ లవర్స్ స్టిక్ అయ్యారు. హుక్ లైన్ నుంచే పల్లవి, చరణాల మీద ప్రేక్షకుడి పల్స్ ఆగేలా సాంగ్ కంపోజ్ చేశారు. సింగర్ వాయిస్ ఈ పాటకి పెద్ద ఎసెట్. ఇక లిరిక్స్ మొత్తం ఎంతో మధురంగా ఉన్నాయి. బహుషా అటు సమంత ఇటు విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ నటించిన సినిమాలలో ఇలాంటి లిరిక్స్ పడలేదనే అనుకోవచ్చు.

ఆరా సే ప్యారూ..అందం తన ఊరు..

సారే హుషారు..బేగం బేజారూ..

ఈ రెండు లైన్స్ నుంచే పాటలోని మాధుర్యం మొదలైంది.

మొదటి చరణంలో.. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే.. అలాగే రెండవ చరణంలో

నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో..

నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

లాంటి పదాలు అద్బుతం. ప్రేమికులు ఈ లిరిక్స్ విని పాటలో తమని తాము ఊహించుకుంటారంటే నమ్మి తీరాల్సిందే. అందుకే ఇప్పుడు నా రోజా నువ్వే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 hour ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

3 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

This website uses cookies.