Mrunal Thakur : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందిమృణాల్ ఠాకూర్ . ఈ మూవీతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. మృణాల్ అందంతో పాటు నటన, కట్టు కొట్టు అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. అందులోనూ నటనకు ఆస్కారం ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ మధ్యనే ఈ భామ నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోడ్రన్ లుక్ తో పాటు చీరలో సంప్రదాయబద్దంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది. రీసెంట్ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో పొల్గొన్న ఈ బ్యూటీ అట్రాక్టివ్ సీ త్రూ గౌను ధరించి స్టైల్ ఐకాన్‌గా నిలిచింది.
ప్రస్తుతం మృణాల్ తెలుగులో ఓ మూవీ చేస్తోంది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేసింది. మృణాల్ లుక్స్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఆమెను పొగడ్తలతో ముంచేశాడు. ఇక ఇదిలా ఉంటే లేటెస్టుగా చేసిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ తన బాడీపైన వస్తున్న కొన్ని ట్రోలింగ్స్ పై మొదటిసారిగా రియాక్ట్ అయ్యింది. ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ..” మన బాడీ ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో లేదు. కొన్నిజాగ్రత్తల వల్ల కొంత మేర శరీరంలో మార్పు రావచ్చు. కానీ పూర్తి స్థాయిలో బాడీని సరి చేయలేము. నేను డెయిలీ వర్కౌట్స్ కోసం జిమ్ వెళ్లినప్పుడు జిమ్ ట్రైనర్లు నా థైస్ పైనే దృష్టి పెడతారు. నా థైస్ ఎలా ఉండా లో చెప్తారు. కానీ, ఇది మీ సమస్య కాదు, నా సమస్య అని చెప్తాను. నా బాడీనే నా స్ట్రెంత్. నేను ఎలా ఉన్నా హ్యాపీ గా ఆక్సెప్ట్ చేస్తాను. నాకు ప్రాబ్లెమ్ లేనప్పుడు మీకు ఎందుకు?.
ఒక్కోసారి మీ బాడీ గురించి మీరు ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి . కొంతమంది సహజంగానే వైకల్యంతో పుట్టవచ్చు. అలాంటి స్త్రీల పట్ల వివక్షణ చూపించడం ఇండియన్స్ కు అలవాటైపోయింది. ఎందుకు వారిని తక్కువగా చూస్తారో అర్థం కాదు. మన శరీరాన్ని హెల్దీ గా ఉంచుకోవాలి. మన శరీరం ఎలా ఉన్నా దానికోసం చింతించాల్సిన పనిలేదు. శరీరం ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నా థైస్ లావుగా ఉంటాయి. అయినా, నాకు ఎలాంటి బాధ లేదు. మీరు కూడా మీ దేహాన్ని ప్రేమించండి” అని మృణాల్ చెప్పింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.