Helping hands: సినీ తారల సంపాదన అంటే అందరికీ ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వారి లైఫ్ స్టైల్, ఇళ్లు, కార్లు, మెయిన్‌టెనెన్స్‌ను చూస్తే అందరూ అవాక్కవుతారు. వారు వాడే ప్రతి వస్తువు బ్రాండ్ కలిగినదై ఉంటుంది. ఎంతో లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తుంటారు ఈ తారలు. ఇంత మంచి లైఫ్ వచ్చిదంటే అది ఊరికే రాదు. వారు పడే కష్టం, జనాల ను ఇంప్రెస్ చేసేందుకు వారు చూపే తపన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు ఉన్నారు. కానీ కొంతమందే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే కొంత మంది హీరోలు, హీరోయిన్‌లు స్క్రీన్ మీదే కాదు తెర వెనకాల కూడా నిజమైన స్టార్స్‌గా గుర్తింపబడుతున్నారు. అందుకు కారణం వారు చేసే సామాజిక కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ తారలు చాలా మంది తమ సంపాదనతో చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.
అందులో ముందుగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంతో మంది చిన్నారుల గుండె చప్పుడయ్యాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టి తనలోని మానవీయతను దశదిశలా చాటుతున్నాడు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని సందేశం ఇవ్వడంతో పాటు మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకుని ఆ గ్రామస్వరూపాన్నే మార్చేసాడు. మహేష్‌బాబు వేసిన ఈ ముందడుగు ఎంతో మందిలో స్ఫూర్తిని కలిగించింది. ఈయన ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది స్టార్స్, ఎన్‌ఆర్‌ఐలు తమ స్వగ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. తమ సొంతూరునే కాదు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని రియల్ హీరో అని నిరూపించాడు ఈ యువరాజు. గ్రామాభివృద్ధికే కాదు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా చిన్నారులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు మహేష్. భార్య నమ్రత తోడ్పాటుతో ఇప్పటి వరకు 125కుపైగా చిన్నారుల హార్ట్ ఆపరేషన్ లకు చేయించి తనలోని మానవీయతను చాటుకున్నారు. అంతే కాదు ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మంది చిన్నారుల బాగోగులను చూసుకుంటూ వారికి ఆపద్భాందవుడిగా నిలిచారు.
ఇక హీరోలేనా హీరోయిన్‌లు ఏం తీసిపోలేదని తనలోని దాతృత్వాన్ని చాటుకుంది సౌత్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ సమంత. ప్రత్యూష అనే సంస్థ ద్వారా ఎందరో చిన్నారు లకు ఆపన్నహస్తం అందిస్తోంది. పెళ్లికి ముందే స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు చికిత్స అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ రియల్ హారోగా నిలుస్తోంది సామ్. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎవ్వరు ఏమన్నా వైఫల్యాలు ఎదురైనా, వ్యక్తిగతంగా బాధలు ఉన్నా ప్రత్యూష ఫౌండేషన్‌లోని పిల్లలో ఓ పిల్లలా కలిసిపోయి వారితో ఆనందంగా గడుపుతూ తన జీవనాన్ని స్వర్గధామంగా మార్చుకుంటుంది ఈ స్టార్. సామ్ చేసే సామాజిక కార్యక్రమాలు ఆమెను మరింత స్టార్‌ను చేశాయి. నిజానికి పేద పిల్లల కోసం ఆమె చేసే సేవా కార్యక్రమాలు చూస్తే ఎవరైనా హాట్సాఫ్ చెప్పాల్సిందే. సమంత ..తాను చేసే కమర్షియల్ యాడ్ ఫిలింస్, షాపింగ్ మాల ఓపెనింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యూష పండేషన్‌కే కేటాయిస్తోంది. అంతేకాదు, సమంత చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి ఎక్కడా స్వయంగా ప్రచారం చేసుకోకపోవడం గొప్ప విషయం.
కరోనా వంటి విపత్కర సమయంలో రవాణా స్తంభించిపోయింది. ఆర్ధిక పరిస్థితులు కుంటుపడిపోయాయి. ఆదాయం రాక ఉద్యోగం లేక కూలీ పనులు దొరక్క ఎంతో నలిగిపోయారు. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఎంతో మంది పేదవారిని దినసరి కూలీలను తన సొంత డబ్బులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చాడు. అంతే కాదు కరోనా పేషంట్స్‌కు పెద్ద మనుసుతో ముందుకు వచ్చి తనకు చేతనైన సహాయాన్ని అందించాడు. ఒకానొక సమయంలో ఆక్సీజన్ కొరత ఏర్పడినప్పుడు సొంతగా ఓ ఆక్సీజన్ ప్లాంట్‌ను నెలకొల్పి ఎంతో మంది పేషెంట్స్‌కు ఊపిరిని అందించాడు. అంతే కాదు హాస్పటిళ్లల్లో బెడ్స్ ఏర్పాటు చేసాడు. పేదవారికి మందులు, వైద్య సేవలు అందించాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎవరు సహాయం కావాలని అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించాడు సోనూ సూద్. అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
సౌత్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన తనువు చాలించి ఈ లోకాన్ని విడినా ఇంకా ఎంతో మంది హృదయాల్లో నిలిచి ఉన్నాడంటే దానికి కారణం ఆయన చేసిన సేవా కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. ఆయన మరణించిన సమయంలో వచ్చిన జనసంద్రాన్ని చూస్తే ఆయనపై ప్రజలు ఏర్పరుచుకున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పునీత్ ఎంతో బిజీ స్టార్ అయినా ఆయన పేద ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప తపనతో ఉండేవాడు. ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నో అనాధా శ్రమాలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, గోశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు చెప్పడంతో పాటు పేదవారికి ఆపన్నహస్తం అందించాడు. ఆయన బ్రతికున్నప్పుడే కాదు మరణాణంతరం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలను 8 కోట్లు డిపాజిట్ చేశారు. అంతే కాదు తన అవయవాలను దానం చేశారు. ఇలాగే వెండితెర పైన స్టార్‌లే కాదు నిజ జీవితంలోనూ స్టార్స్‌గా నిలుస్తూ ఎందరో చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం చూపుతున్నారు.
ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేరుగా సోషల్ మీడియా ద్వారా గానీ, సమంత.. మహేశ్ బాబు..సోనూసూద్ ఫౌండేషన్ మెంబర్స్‌ను గానీ కలిసి ఎలాంటి ఇబ్బందు లున్నాయో పూర్తి వివరాలను అందిస్తే వారు అందుకు తగిన సహాయాన్ని అందిస్తున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీరిని సంప్రదించవచ్చును.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.