Heart Stroke: మారుతున్న జీవన పరిస్థితులతో పాటు ప్రజల జీవన విధానాలు కూడా మారుతున్నాయి. నిత్యం ఒత్తిడిమాయమైన ప్రయాణాలు ప్రజలు కొనసాగిస్తున్నారు. బ్రతకడం కోసం ఉదయం నిద్రలేచింది మొదలు మరల నిద్రపోయె వరకు టెన్షన్ తోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మానసికంగా, శారీరకంగా చాలా మంది అలసిపోతున్నారు. దీంతో చిన్న వయస్సు నుంచి గుండె సంబందిత అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ తో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిపోయి చనిపోతున్నారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఎవరు మరిచిపోరు. అయితే అలాంటి మరణాలు ప్రతి రోజు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి.
ఇదిలా ఉంటే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ అనే సంస్థ ఇండియాలో మరణాలపై కీలక విషయాలు వెల్లడించింది. భారత్ లో అత్యధికంగా సంభవిస్తున్న సహజ మరణాలలో హార్ట్ స్ట్రోక్ ఒక కారణం అని తెలియజేసింది. ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ లెక్కల ప్రమారం ప్రతి 4 నిమిషాలకి ఒక వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారని తెలిపారు. అలాగే ప్రతి 40 సెకండ్స్ కి ఒక హార్ట్ స్ట్రోక్ వస్తుందని అన్నారు. అలాగే ప్రతి ఏడాది 1,85 వేల స్ట్రోక్స్ సంభవిస్తున్నాయని తెలిపారు. 2021 లెక్కల ప్రకారం హార్ట్ స్ట్రోక్ తో ఇండియాలో చనిపోయిన వారి సంఖ్య 28 వేలకి పైనే ఉంది. ఇక గత ఏడాది ఆ నెంబర్ 30 వేలు దాటినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ఏడాది ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ కూడా సడెన్ హార్ట్ స్ట్రోక్ కి కారణం అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే హార్ట్ స్ట్రోక్ సంభవించే కొద్ది క్షణాల ముందు ఛాతీ నొప్పి, భుజం, చేయి, వీపు, దంతాల నొప్పి, చెమట పట్టడం, అలసట, గుండెల్లో మంట లేదా అజీర్ణం, వికారం, ఆకస్మిక మైకం, శ్వాస ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. కార్డియాక్ అరెస్ట్ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయిన, ఒక్కసారిగా నీరసం ఆవహించి అచేతంగా మారిపోయి క్రింద పడిపోతారు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇస్తే వారిని బ్రతికించే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.