RRR Movie: ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ తో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ బరిలో కూడా కూడా నామినేషన్ కు వెళ్లిన ఈ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఫైనల్ పోటీలకు ఎంపికైంది. ఇండియా నుంచి ఆస్కార్ ఫైనల్ కు వెళ్లిన మొదటి తెలుగు సాంగ్ నాటు నాటు రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఈ అవార్డుల వేడుకలో నాటు నాటు పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించమని సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.
ఆస్కార్ అవార్డులు వేడుకలో వేదికపై ప్రదర్శన ఇవ్వడం భారతీయులకు ఇది రెండో సారి అవుతుంది. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జైయహో సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ కూడా ఆస్కార్ వేడుక వేదికపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఒక టాలీవుడ్ సంగీత దర్శకుడు కి ఈ అవకాశం రావడం నిజంగా గర్వకారణం చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో కూడా అవార్డు గెలుచుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు ఆశిస్తున్నాడు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వస్తే కచ్చితంగా అది మన సంస్కృతికి, గ్రామీణ ప్రాంతాలలో మాస్ డాన్స్ కి లభించిన గొప్ప గౌరవం అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి అవకాశాన్ని నాటు నాటు సాంగ్ ఎంతవరకు అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.