MLC Elections: ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు వేడి మొదలైంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి గాను మొత్తం15 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 13న ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి వైసీపీ, టీడీపీ బలంగా పోటీ పడుతున్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీ ఈ ఎన్నికలలో కూడా తిరిగి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ సీట్లు పోటీ లేకుండానే ఏకగ్రీవం చేసుకున్నాయి. మిగిలిన స్థానాలలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది.
ఇందుకు గాను ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకి ఇన్ చార్జ్ లని నియమించి స్థానిక సంస్థల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కచ్చితంగా అధికార పార్టీ గెలుపుకి పనిచేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ అభ్యర్ధులని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపధ్యంలో కచ్చితంగా అన్ని స్థానాలలో గెలుస్తామని జగన్ ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఎప్పటిలాగే నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ ఏకగ్రీవం చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.
అయితే నామినేషన్లు వేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు అనేది వైసీపీ నేతల మాట. ఓడిపోతామని తెలిసి ఎవరూ నామినేషన్లు వేయడానికి ముందుకి రావడం లేదని వారి వాదన. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడం ద్వారా స్థానిక సంస్థల నాయకులలో వ్యతిరేకత ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వైసీపీ సిద్ధం అవుతుంది. మరో వైపు ఉత్తరాంద్రలో అన్ని స్థానాలలో గెలిచి విశాఖ రాజధాని అనే అంశాన్ని బలపరచాలని భావిస్తున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.