Sonakshi Sinha : వెడ్డింగ్ లెహెంగాలో మైండ్ బ్లోయింగ్ సొగసులు

Sonakshi Sinha : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రముఖ భారతీయ డిజైనర్ అంజు మోడికి మ్యూజ్‌గా వ్యవహరించింది. ముంబై టైమ్స్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో భాగంగా అంజు మోడి లేటెస్ట్ కలెక్షన్స్‌ శాశ్వత్‌ నుంచి అద్భుతమైన దుస్తులను సేకరించి ర్యాంప్‌పైన సందడి చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో సోనాక్షి ర్యాంప్‌పై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

సోనాక్షి సిన్హా, మల్టీకలర్, అందమైన డిజైనర్ లెహెంగాను ఈ షో కోసం వేసుకుంది. నారింజ రంగు లెహంగా వేసుకుని దానికి జోడీగా ఫుల్ స్లీవ్స్‌తో వచ్చిన రెడ్ వెల్వెట్ బ్లౌజ్ వేసుకుంది. ఇక తన ట్రెడిషనల్ లుక్‌కు స్టైలిష్ మెరుగులు దిద్దేందుకు రెండు దుపట్టాలను తన నడుము చుట్టూ గుండ్రంగా చుట్టుకుంది. ఈ స్టన్నింగ్ లెహెంగా సెట్‌తో ర్యాంప్‌పైన గ్రేస్‌ఫుల్‌గా నడిచి కెమెరాకు అద్భుతమైన ఫోజులు ఇచ్చింది సోనాక్షి.

అంజు మోడీ రూపొందించిన ఈ లెహెంగా కలెక్షన్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రైట్ కలర్స్‌తో ట్రెడిషనల్ లుక్‌లో మోడల్స్ ర్యాంప్‌పైన తళుక్కుమన్నారు. షో స్టాపర్‌గా నిలిచిన సోనాక్షి మల్టిపుల్ లేయర్స్‌తో వచ్చిన వింటర్ వెడ్డింగ్ వేర్ ను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
మోడీ తన తాజా కలెక్షన్స్ ద్వారా ఈ సంవత్సరం పండుగ , పెళ్లల్ల సీజన్‌లకు వింటేజ్ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తోంది.

బాలీవుడ్ సెలబ్రిటీ సోనాక్షి ఈ అద్భుతమైన లెహెంగా సెట్‌లో తారలా మెరిసింది. క్లిష్టమైన అలంకరాలు, డ్రేప్డ్ షిఫాన్‌తో పాటు మెటాలిక్ బార్డర్‌లతో ఈ లెహెంగానూ ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేశారు డిజైనర్. డబుల్ దుపట్టా స్టైల్స్‌ను అనుసరించి కాబోయే పెళ్లి కూతుర్లకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తోంది సోనాక్షి. చీరనే దుపట్టాగా ధరించి సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తోంది. ఈ అద్భుతమైన లెహెంగాలో రాయల్‌ లుక్‌లో కనిపించింది సోనాక్షి. ఇక తన వింటేజ్ హెయిర్ స్టైల్‌ ఈ ట్రెడిషనల్ లుక్‌కు మరింత రంగులను అద్దింది. ఈ లెహంగా సెట్‌కు మ్యాచ్‌ అయ్యే విధంగా బంగారు ఆభరణాలతో తన మేనిని అలంకరించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో సోనాక్షి కూడా ఒకరు. ఈ బ్యూటీ సరికొత్త అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల నుంచి ఎత్నిక్ వేర్‌ వరకు ప్రతీ అవుట్‌పిట్‌లోనూ తనను తాను కొత్తగా చూపిస్తూ తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ లెహెంగా సెట్ పిక్స్‌ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిజైన్ అంజు మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో సోనాక్షి పిక్స్‌ను పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లైకులు షేర్ల వర్షం కురుస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

10 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

12 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.