Microsoft: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లెవల్ ని చూస్తుంది. దీని ద్వారా సంస్థ సమాచారం కూడా తెలుసుకుంటుంది. మానవ మేధస్సుకి ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ భవిష్యత్తులో అతి పెద్ద ప్రశ్నగా మారబోతుందనే సంగతి ఇప్పటికే టిక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సరికొత్త ఉద్యోగాలు తెరపైకి వస్తాయని, కంపెనీలు మనవ మేధస్సుని, మానవ వనరులని టెక్నాలజీకి తగ్గట్లుగా వేరొక విధంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయని అంటున్నారు. ఇలా టెక్నాలజీలో అప్డేట్ వెర్షన్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. అయితే రెండు దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ప్రపంచంలో సెర్చ్ ఇంజన్ విధానాన్ని ప్రారంభించింది మైక్రోసాఫ్ట్.
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ పేరుతో (ఐఈ) అంతర్జాల ప్రపంచంలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి తీసుకొచ్చింది. దశాబ్దకాలం పాటు ఐఈ ఆధిపత్యం నడిచింది. దీనిలో చాలా అప్డేట్ వెర్షన్స్ తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఇందులో ఐఈ 11 వెర్షన్ నడుస్తుంది. ఈ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కి పోటీగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ సెర్చ్ ఇంజన్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. అయితే మొజిల్లా ఐఈని బీట్ చేయలేకపోయింది. ఎప్పుడైతే గూగుల్ క్రోమ్ ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకోచ్చిందో. అప్పటి నుంచి ఐఈ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఓ విధంగా పతనం వైపు నడిచింది అని చెప్పాలి.
ఇక ప్రస్తుతం అంతర్జాలంలో ఐఈ వినియోగం చాలా వరకు తగ్గింది. దీంతో మైక్రోసాఫ్ట్ దానికి అప్డేట్ వెర్షన్ గా మరింత సమర్దవంతంగా సులభమైన ఇంటర్ ఫేజ్ తో నడిచే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ని తీసుకొని వచ్చింది. అయితే గూగుల్ క్రోమ్ స్థాయిలో ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది నెటిజన్లుకి రీచ్ కాకపోయిన ఐఈ 11తో పోల్చుకుంటే 10 ఎక్స్ టైమ్స్ మెరుగైంది అనే ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మైక్రో సాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ సేవలకి ముగింపు చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఐఈ11 బ్రౌజర్ పని చేయడని చెప్పింది. దానిని ఇంకా వినియోగిస్తున్న వారు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కి అప్డేట్ కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఐఈ11 వాడుతున్న అన్ని డివైజ్ లకి అప్డేట్ వెర్షన్ ఎడ్జ్ ని త్వరలోనే ఇస్తామని ప్రకటించింది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.