Categories: Tips

summer holidays: సమ్మర్ హాలిడేస్ లో పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలి అంటే…

summer holidays: సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే చాలా మంది పిల్లల విషయంలో నానా హైరానా పడుతుంటారు. మరీ ముఖ్యంగా మూడు సంవత్సరాల పిల్లల నుంచి పది పన్నెండేళ్ళ పిల్లల విషయంలో అమ్మానాన్నలు ఎండ తీవ్రత నుంచి ఎలా సురక్షితంగా చూసుకోవాలి అని ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో అధిక శాతం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తున్నవారే కావడం ఇక్కడ వస్తున్న ప్రధాన సమస్య. దాని వల్ల పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించాలి.. అలా అప్పగించినా మనం చూసుకున్నట్టు పిల్లలను అన్నీ విషయాలలో జాగ్రత్తగా చూసుకోగలరా అనే ఆలోచన ఇంటి నుంచి బయటకు రావడం దగ్గర్నుంచే మొదలవుతుంది.

దీని వల్ల ఆఫీసులకి వెళ్లినా కూడా ధ్యాసంతా అమ్మానాన్నలిద్దరికీ తమ పిల్లల మీదే ఉంటుంది. కాబట్టి, ఇక్కడ కొన్ని అవకాశాలున్నాయి. సాధారణంగా కొన్ని కంపెనీలలో మాత్రమే తప్ప దాదాపు ఎక్కువ శాతం కంపెనీలలో షిఫ్ట్ ల వారిగా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటోంది. దీనిని అమ్మానాన్నలిద్దరు సమన్వయ పరుచుకొని ఇంట్లో పిల్లల బాధ్యత గురించి యాజమాన్యానికి పూర్తిగా వివరించి ఉదయం షిఫ్ట్ ఒకరు మధ్యాహ్నం షిఫ్ట్ ఒకరు ఆఫీసులకు వెళ్లేలా సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల తమ పిల్లలతో తల్లిదండ్రులిద్దరూ కలిసి కేర్ తీసుకునే అవకాశం దొరుకుతుంది.

methods to engage children in summer-holidaysmethods to engage children in summer-holidays
methods to engage children in summer-holidays

ముఖ్యంగా సమ్మర్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం పిల్లలను ఆటలకు, స్విమ్మింగ్ నేర్చుకునేందుకు, అలాగే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి వాటి మీద పట్టు సాధించే విధంగా ఎంకరేజ్ చేయాలి. వీటిపై పిల్లలకు అవగాహన కల్పించి సమ్మర్ క్యాంప్స్ ఎక్కడైతే నిర్వహిస్తుంటారో చూసుకొని వాటిలో షార్ట్ టర్మ్ కోర్సులలో జాయిన్ చేయాలి. ఆట లలో కూడా ఎక్కువగా చెస్, క్రికెట్, షెటిల్ బ్యాట్‌మెంటన్, ఫూట్ బాల్, వాలీబాల్, కబడ్డీ లాంటి నేషనల్ స్థాయిలో ఆడే క్రీడలలో ప్రోత్సహించాలి.

అలాగే, బుక్ రీడింగ్ వల్ల భాష మీద మంచి పట్టు వస్తుంది. ఏజ్ గ్రూపులకు తగ్గట్టు గా మంచి వెకాబలరీ ఉన్న పుస్తకాలను ఇచ్చి పదాలను ఎలా పలకాలో వాటికి ఉండే అర్థాలెన్నో..ఏ ఏ పదాలను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారో..వంటి అనేక విషయాల మీద అవగాన కలిగేలా అమ్మానాన్నలు పిల్లలను ఎంకరేజ్ చేయాలి. ఇక స్విమ్మింగ్ అనేది కూడా నేషనల్ స్థాయిలో పోటీ పడే క్రీడ. అలాగే, స్విమ్మింగ్ నేర్పించడం వల్ల కూడా అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన వారినీ కాపాడవచ్చు. అందుకే, నాలుగైదేళ్ళ నుంచే పిల్లలకు సమ్మర్ సీజన్స్‌లో ఈత నేర్పించడం అన్ని విధాల ఎంతో ఉపయోగకరం.

ఇక క్రికెట్, వాలీబాల్, షెటిల్ బ్యాట్ మెంటన్ లాంటి ఆటలను సమ్మర్ హాలిడేస్‌లలో ఎక్కువగా నేర్పించడానికి ప్రయత్నించాలి. ఆ క్రీడలలో గనక పిల్లలకు ఆసక్తి బాగా ఉంటే మాత్రం తప్పకుండా పూర్తి స్థాయిలో ఛాంపియన్ అయ్యేలా ప్రోత్సహించాలి. చాలా మంది అమ్మానాన్నలు ఇప్పుడు ఎక్కువ శాతం ఫస్ట్ ర్యాంక్ రావాలనే కోరిక తో తమ పిల్లలు పూర్తిగా చదువు మీదే దృష్ఠి పెట్టిస్తున్నారు తప్ప మిగతా వినోదాన్ని, క్రీడలను, ఇతర కాంపిటీటెవ్ ప్రోగ్రాంస్‌లో పాల్గొనేలా ఎంకరేజ్ చేయడం లేదు.

దీని వల్ల పిల్లల్లో మానసికమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఏజ్ వచ్చే వరకు క్రీడలలో కూడా ప్రోత్సహించడం ఎంతో ఉత్తమం. దీనికి సమ్మర్ హాలిడేస్‌ను బాగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆర్ట్స్…దీనిలో చాలా మంది పిల్లలు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్ట్స్ అంటే కేవలం డ్రాయింగ్ మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కూడా పిల్లలకు నేర్పించడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల కూడా అవగాహన కలుగుతుంది. దీనివల్ల చారిత్రాత్మక విషయాలను తెలుసుకుంటారు. ఇందులో ప్రావీణ్యం సంపాదిస్తే గనక జాతీయస్థాయిలో కూడా భరత నాట్యం, కూచిపూడి వంటి క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని విజయం సాధించవచ్చు.

అలాగే, చెస్ ఆడే వారిలో షార్ప్‌నెస్ బాగా ఉంటుంది. ఆ క్రీడా పోటీలలో పాల్గొన్న వారూ గొప్ప లక్షాలను చేరుకుంటున్నారు. వీటితో పాటు పిల్లలకు అవగాహన అభిరుచి పెంపొందించడానికి ఎన్నో మంచి రంగాలున్నాయి. ఏ విద్యార్థికైనా బేసిక్స్ బాగా నేర్పించాలి. పై చదువులకు వెళ్లిన తర్వాత ఫండమెంటల్స్ నేర్చుకోవడం కుదరదు. అలాగే, ప్రతీ పిల్లవాడిలో లేదా అమ్మాయిల్లో ఉన్న ఆసక్తి చిన్నప్పుడే గుర్తించాలి. అయితే, ఏడాది మొత్తం స్కూల్స్ – బుక్స్‌తోనే సమయం సరిపోయేలా ప్రస్తుత విద్యా విధానం కొనసాగుతోంది.

సంగీతం నేర్పించడం, గాయనీ, గాయకులుగా తయారు చేసేందుకు కూడా సమ్మర్ హాలిడేస్‌ను బాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడున్న వివిధ రంగాలలో సంగీతాని కీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంతో మంది సంగీత దర్శకులుగా చిత్ర పరిశ్రమలలో రాణిస్తున్నారు. ఇక నేషనల్ – ఇంటర్‌నేషనల్ స్థాయిలో ప్రముఖ గాయనీ, గాయకులుగా రాణిస్తున్నారు. అంతేకాదు, కొంతమందిలో ఉన్న టాలెంట్‌ను గనక తల్లిదండ్రులు పియానో ప్లేయర్‌గా, ఫ్లూటిస్ట్‌గా, కీ బోర్డ్ ప్లేయర్‌గా ఇలా రక రకాల వాయిద్యాలను నేర్చుకొని అందులో కళాకారుడిగా రాణించడానికి ఎన్నో అవకాశ మార్గాలున్నాయి. ఇలాంటి ఎన్నో విభిన్నమైన రంగాలలో రాణించడానికి తమ పిల్లలను అమ్మానాన్నలు ఎంకరేజ్ చేయడానికి వారిలో ఉన్న సత్తా ఏదో కనుగొనడానికి సమ్మర్ హాలిడేస్ ఎంతో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అందుకే, ప్రతీ సమ్మర్ వెకేషన్స్‌లో పిల్లలకు అనేక రంగాల గురించి అవగాహన కల్పిం చాల్సిన బాద్యత తల్లిదండ్రులదే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

4 days ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

3 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

1 month ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

1 month ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

1 month ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 months ago