Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్). తన 19వ సినిమాను సొంత బ్యానర్ ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’లో నటిస్తూ.. సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన చిత్ర బృందం, హీరోకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, సాయి దుర్గా తేజ్ ఈ మూవీలో ఓ యోధుడి పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ దట్టమైన అడవిలో ఆకాశం వైపు చూస్తున్న ఒక యోధుడిలా కనిపిస్తున్న ఈ ప్రీ లుక్ ప్రస్తుతం మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది బాగా వైరల్ అవుతోంది.
మెగా హీరోలలో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సినిమాలు చాలా సెలెక్టెడ్‌గా ఉంటున్నాయి. డిఫరెంట్ జోనర్ సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కాస్త సినిమాల ఊపు తగ్గిన మాట వాస్తవం అయినప్పటికీ, కథల పరంగా మాత్రం ఏవిధంగానూ.. తొందరపడకుండా ఆలోచించి ఎంచుకుంటున్నాడు. మేనమామ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కూడా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. విరూపాక్ష లాంటి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని హిట్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ప్రస్తుతం, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ఇది భారీ పాన్-ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కావడం విశేషం. కాగా, ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ మూవీలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ మూవీని సుమారు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే, తన 19వ చిత్రంగా సొంత నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు సాయి దుర్గా తేజ్. ఈ సినిమాను ఇటీవల కిరణ్ అబ్బవరంతో “క” వంటి వినూత్న చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శక ద్వయం సుజిత్ – సందీప్ ఎమ్ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సాహు గారపాటి మరో నిర్మాత కావడం విశేషం. షైన్ స్రీన్స్ బ్యానర్, ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ సహా ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…
Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
This website uses cookies.