Mega 158: మెగా 158 టైటిల్ “కాకా” ఫిక్సైందా?

Mega 158: మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా 158 కి టైటిల్‌గా ‘కాకా’ అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా ఇంటస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఇందులో వింటేజ్ మెగాస్టార్‌ను చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. అనిల్ రావిపూడి అనుకున్నట్టుగానే వింటేజ్ మెగాస్టార్ చూపించి సక్సెస్ అయ్యాడు.

ఇటీవల కాలంలో చిరంజీవికి భారీ హిట్ దక్కలేదు. దీంతో, ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఈ రేర్ ఫీట్‌తో ఆయన మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ రిలీజైన మిగతా నాలుగు సినిమాలతో చూసుకుంటే భారీ హిట్ సాధించింది. ఇక, ఇదే జోష్‌లో ఆయన నటించబోతున్న తన 158వ సినిమా పనులను మొదలుపెట్టారు. అయితే, తాజాగా ఈ సినిమాకి మేకర్స్ ఓ మాస్ అండ్ స్ట్రాంగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

mega-158-tittle-kaakaa-fixed

Mega 158: మెగాస్టార్-బాబి కాంబోలో పట్టాలెక్కబోతున్న ఈ క్రేజీ చిత్రానికి “కాకా”..!

‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో మెగాస్టార్ చిరంజీవికి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ..ఇప్పుడు చిరంజీవిని మరో పవర్‌ఫుల్ రోల్ లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ అంతా కూడా దుబాయ్‌లో జరుగుతోంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో మెగా 158 చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మెగా 158 టైటిల్ “కాకా”?

మెగాస్టార్-బాబి కాంబోలో పట్టాలెక్కబోతున్న ఈ క్రేజీ చిత్రానికి “కాకా”..అనే ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో చిరు పవర్‌ఫుల్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రల్లో చిరు కనిపించలేదు. మాస్ ఆడియన్స్‌లో ఆయనకున్న క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులను, సినీ లవర్స్‌ను ఎగ్జైట్ చేసేలా ఓ యాక్షన్ కథను చిరు కోసం బాబీ తయారు చేసినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇక, ఈ సినిమా స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత కోన వెంకట్ పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం.

చిరుకి జంటగా ప్రియమణి, కూతురుగా కృతి శెట్టి?

mega-158-tittle-kaakaa-fixed

“కాకా” పేరు పరిశీలనలో ఉన్న మెగా 158లో ‘పరుత్తివీరన్’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి చిరుకు జంటగా నటించంబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రియమణి బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో చాలా బీజీగా ఉంది. తెలుగులో మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ మెగా 158లో గనక చిరుకి జంటగా ప్రియమణి నటించేది కన్‌ఫర్మ్ అయితే ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. అలాగే, యంగ్ బ్యూటీ కృతి శెట్టి..చిరుకి కూతురుగా నటించబోతున్నట్టు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీల తరహా పాత్ర అని కూడా సమాచారం అందుతోంది. అలాగే, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాస్టింగ్ అంతా గనక మెగా 158 (‘కాకా’-పరిశీలనలో ఉన్న టైటిల్) లో ఉంటే అంచనాలు ఏ ఒక్కరూ ఊహించలేరు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

5 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

5 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.