Spirit: ఒక్క ఎక్స్‌ప్రెషన్ కోసం ప్రభాస్ ని 2 గంటలు వేధించిన సందీప్ రెడ్డి వంగ?

Spirit: ఒక్క ఎక్స్‌ప్రెషన్ కోసం ప్రభాస్ ని 2 గంటలు వేధించిన సందీప్ రెడ్డి వంగ? అవును..తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయిన ఎక్స్‌లో దీనికి సంబందించిన పోస్ట్ ఒకటి అంతటా బాగా వైరల్ అవుతోంది. ఒక్కో దర్శకుడు తనకి కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకూ హీరో అయినా సరే వదలకుండా ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటుంటారు. అప్పట్లో ఒకే కథను అటు తమిళంలో ఇటు తెలుగులో చేశారు. ఆ సినిమాలో ఉన్న సీన్ కోసం దర్శకుడు రోజంతా ఒక్క షాట్ తీయడమే గగనం అయింది.

తమిళంలో స్టార్ హీరో రోజు మొత్తం చేసినా దర్శకుడికి అనుకున్న అవుట్‌పుట్ రాక అదే షాట్ నెక్స్ట్ డే కంప్లీట్ చేశాడు. కానీ, తెలుగులో మాత్రం చిరంజీవి సాయంత్రానికల్లా ఆ షాట్ దర్శకుడనుకున్నట్టు పూర్తి చేయగలిగాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఇప్పటికీ కొన్ని సీన్స్ ఎడిట్ రూమ్ లో చూసుకున్నాక మళ్ళీ రీ షూట్ చేస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి అయితే ఇంకా దారుణంగా ఉంటాడని చెప్పుకుంటుంటారు. షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చినప్పటికీ, ఇంకా ఎక్కువ షాట్స్ తీస్తుంటారు.

spirit-sandeep-reddy-vanga-harassed-prabhas-for-2-hours-for-a-single-expression

Spirit: ఒక ఎక్స్‌ప్రెషన్ కోసం ప్రభాస్‌ను రెండు గంటల పాటు ఎండలో

అలాగే, సందీప్ రెడ్డి వంగ కూడా ఒక్క షాట్ కోసమే.. ఇంకా చెప్పాలంటే, ఒక ఎక్స్‌ప్రెషన్ కోసం ప్రభాస్‌ను రెండు గంటల పాటు ఎండలో నించోపెట్టాడట. అంతేకాదు, స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ డిసెంబర్‌లో కంప్లీట్ చేశారు. కానీ, ఒక్క సీన్ మాత్రమే చేశారని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చావగొట్టు..అయినా మాకు ఇండస్ట్రీ హిట్ కావాలి..అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సలార్ తర్వాత నుంచి మళ్ళీ ప్రభాస్ నుంచి హెవీ యాక్షన్ మూవీ రాలేదు.

ఇటీవల వచ్చిన ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ అభిమానులను మాత్రమే కాకుండా సినీ లవర్‌ను ఎంతగానో డిసప్పాయింట్ చేసింది. దాంతో, ఇప్పుడు రాబోతున్న ఫౌజీ, స్పిరిట్ సినిమాల మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన స్పిరిట్ మూవీ ఫస్ట్ పోస్టర్ మాత్రం అమాంతం అంచనాలను ఆకాశంలో పెట్టాయి. ఈ ఒక్క పోస్టర్‌తో ప్రభాస్‌కి సందీప్ రెడ్డి వంగ తిరుగులేని హిట్ ఇవ్వబోతున్నాడని అందరూ మాట్లాడుకున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్, అనిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో అర్థమైంది. దాంతో, ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాపై అంచనాలు ఏ ఒక్కరి ఊహకి అందడం లేదు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

6 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

6 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

1 week ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

1 week ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 week ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 week ago

This website uses cookies.