RT 77: రవితేజ 77వ సినిమా టైటిల్ ఇదేనా? పక్కా క్లాసిక్!

RT 77: రవితేజ 77వ సినిమా టైటిల్ ఇదేనా? అయితే ఇది పక్కా క్లాసిక్ అంటున్నారు మన మాస్ మహారాజ రవితేజ భిమానులు. ఇటీవలే రవితేజ భర్త మహాశయులకువిజ్ఞప్తి సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. కిషోర్ తిరుమల సినిమా అంటే క్లాస్ మూవీ. రవితేజ అంటే పక్కా మాస్ కథ. కానీ, వీరి కాంబినేషన్‌లో వచ్చిన భర్త మహాశయులకువిజ్ఞప్తి మాత్రం రవితేజ దర్శకుడి అభిరుచికి తగ్గట్టే క్లాస్ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఈ మధ్యకాలంలో మన మాస్ రాజాకి ఆశించిన హిట్ దక్కడం లేదు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్, భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమాలు ఎన్నో అంచనాలతో వచ్చాయి. కానీ, ఈ రెండు సినిమాలు రవితేజకి హిట్ ఇవలేదు. చెప్పాలంటే మాస్ జాతర, మిస్టర్ బచ్చన్ మ్యూజికల్‌గా సూపర్ హిట్స్. కానీ, రిలీజైయ్యాక మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ, మరో 4 సినిమాలతో పోటీపడి వచ్చిన భర్త మహాశయులకువిజ్ఞప్తి సినిమా మాత్రం క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. నిర్మాతలకి మరీ పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టకపోయినా, సంక్రాంతి బరిలో మాత్రం మంచి వసూళ్ళను రాబట్టింది.

rt-77-is-this-the-title-of-ravi-tejas-77th-film-a-surefire-classic

RT 77: జనవరి 26న టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ పోస్టర్:

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమా:

నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి లాంటి క్లాసిక్స్ తీసిన దర్శకుడు శివ నిర్వాణ..రవితేజ కోసం మరో క్లాస్ సబ్జెక్ట్‌ను తయారు చేశాడు. ఈ కథ మన మాస్ మహారాజాకి బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలో, సెట్స్‌పైకి రాబోతోంది. ఇప్పటికే, మ్యూజిక్ సిట్టింగ్స్..డాన్స్ కొరియోగ్రాఫర్స్‌తో మీటింగ్ సహా మిగతా అన్నీ పనులను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన అప్‌డేట్ వచ్చింది.

జనవరి 26న టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ పోస్టర్:

శివ నిర్వాణ-రవితేజ కాంబినేషన్‌లో రూపొందనున్న ఆర్‌టి 77 సినిమా నుంచి జనవరి 26న ఉదయం 10గంటలకి ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో, ఈ మూవీలో రవితేజ రోల్ ఎలా ఉండబోతుందో హింట్ రాబోతుంది. ఇక, ఈ మూవీకి “ఇరుముడి” అనే ఓ డిఫరెంట్ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. రవితేజ ఫస్ట్‌లుక్‌తో పాటు “ఇరుముడి” అనే టైటిల్‌ను కూడా రివీల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే టైటిల్ గనక ఫిక్స్ చేస్తే పక్కా రవితేజ తన పంథా మార్చి క్లాస్ కథలవైపు నడవడానికి రెడీ అయినట్టే. ఆల్రెడీ భర్త మహాశయులకువిజ్ఞప్తి మూవీతో కాస్త రూటు మార్చాడు. ఇప్పుడు, శివ నిర్వాణ సినిమాతో ఇంకోసారి, క్లాస్ మూవీనే ఎంచుకున్నట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

6 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

6 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

1 week ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

1 week ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 week ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 week ago

This website uses cookies.