Mega 157: లీకులు మొదలు చిరు ఉలా ఉన్నారేంటి..?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న “మెగా 157” మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో లీకై, నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిరంజీవితో పాటు బుల్లిరాజు కూడా కనిపించాడు. ఇద్దరి మధ్య చిలిపి రొమాన్స్‌లా కనిపించే ముద్దు సన్నివేశం నెటిజన్లకు విపరీతంగా నచ్చుతోంది.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ చూసి అభిమానులు పులకించిపోతున్నారు. స్టైలిష్ అవతారంలో మెగాస్టార్ దర్శనమివ్వగా, ఆయన కామెడీ టైమింగ్ మరోసారి వింటేజ్ చిరును గుర్తు చేస్తోంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాల్లో చూపిన కామెడీ శైలిని తిరిగి తెరపై చూపించేందుకు అనిల్ రావిపూడి రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన లీక్ వీడియో చూస్తే చిరుతోపాటు బుల్లిరాజు స్క్రీన్‌పై మంచి కామెడీ రచ్చ చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది.

2026 సంక్రాంతి టార్గెట్‌తో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. చిరంజీవి కూడా అనిల్ స్పీడ్‌కు తగినట్లుగా షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా టోటల్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉండబోతుందట. “సంక్రాంతికి వస్తున్నాం” ఫ్లేవర్‌తో ఈ మూవీ సాగుతుందని సమాచారం.

mega-157-chiru-look-leaked-goes-viral

Mega 157: చిరుతో అనిల్ రావిపూడి భారీ హిట్

బుల్లిరాజు పేరు ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దలవరకూ మంచి గుర్తింపు పొందింది. ఆవిడే బుల్లి మురారి.. ఇప్పుడు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం పది కంటే ఎక్కువ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న బుల్లిరాజును డేట్ అడగడమే కష్టంగా మారిందని అనిల్ రావిపూడి సరదాగా చెప్పారు కూడా!

ఈ సినిమా ద్వారా చిరుతో అనిల్ రావిపూడి భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. వెంకీమామతో మూడు వందల కోట్ల కలెక్షన్లను అందుకున్న అనిల్, ఈసారి చిరుతో ఐదు వందల కోట్ల లక్ష్యాన్ని సాధించాలని చూస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

లీకైన వీడియోతోనే సోషల్ మీడియాలో ఇంత హైప్ అయితే, సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాక ఇంకెంత హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, “మెగా 157” చిరు ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరికీ పండుగలా ఉండబోతుంది!

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

8 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

10 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.