Mega 156: మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ చిత్రంతో హాట్ టాపిక్‌గా మారిన మల్లిడి వశిష్ఠ్ కాంబినేషన్‌లో మెగా 156 ఇటీవల విజయదశమి పండుగనాడు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫ్యాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపొందబోతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచారు.
ఇక ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ‘వీరుడు’ లాంటి పలు టైటిల్స్ అనుకున్న చిత్రబృందం చివరికి ‘విశ్వంభర’ టైటిల్ వైపే మొగ్గు చూపారట. ఈ టైటిల్ చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పుకుంటున్నారు. దసరా పండుగ నాడు సాంగ్ రికార్డింగ్ తో మెగా 156 మొదలైంది. వాస్తవానికి మెగా 156 చిత్రాన్ని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించాల్సింది. అందుకే మెగా 157 గా పోస్టర్ వదిలారు.
అయితే, ఇప్పుడు ఆర్డర్ మారి మెగా 156 గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే అనుష్క శెట్టి ఫైనల్ అయిందని తాజా సమాచారం. గతంలో అనుష్క చిరు సరసన ఓ సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. కానీ, చిరంజీవి సరసన హీరోయిన్‌గా మాత్రం నటించలేదు. మెగా 156 లోనే మొదటిసారి. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా నటించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ప్రముఖంగా దీపిక పడుకొన్, శ్రద్ధ కపూర్‌ల పేరు వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ చిరు సరసన సందడి చేయనుందని తెలుస్తోంది. వారెవరో త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారట.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.