Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా మంచి ఎదుగుదల రావడం కోసం ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పెద్దవాళ్లు గర్భం దాల్చిన మహిళలు చేప తినకూడదని చేప తింటే బిడ్డ చర్మం కూడా చేప పొలుసులాగా ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వైద్య నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
మరి గర్భం దాల్చిన మహిళలు చేపలను ఆహారంగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే.. చేపలు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అయితే గర్భం దాల్చిన మహిళలు చేపలు తినటం వల్ల పుట్టబోయే పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు 20% తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇక మెదుడు ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి.
చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం సమస్యను తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇక పిండం ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి కనుక వారంలో కనీసం ఒక్కసారైనా చేపలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇకపై ఎలాంటి అపోహలు లేకుండా గర్భిణీ స్త్రీలు చేపలను వారి ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతో ముఖ్యం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.