Biogas: ప్రపంచంలో రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఓ వైపు పరిశ్రమల నుంచి విపరీతమైన కాలుష్యం వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మరో వైపు మానవ అవసరాల కోసం తయారు చేసుకున్న వాహన యంత్రాలు ద్వారా కూడా విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది. ఈ వాహన వినియోగం ప్రజల అవసరాలలో భాగం అయిపోయాయి. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవారు ఇప్పుడు బైక్ మీద తిరుగుతున్నారు. ఒకప్పుడు బైక్ లు వాడేవారు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ప్రపంచంలో జనాభాతో సమానంగా వాహనాలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఏ స్థాయిలో కాలుష్యం బయటకి పంపింగ్ అవుతుందో అంచనా వేయడం కష్టం.
ఇక కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కోట్లాది మంది ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచం మరింత అడ్వాన్స్ అవుతున్న కొద్ది వాహనాల కోసం ఉపయోగించే ఇంధనం విషయంలో మరింత కేర్ ఫుల్, వాతావరణంలో మార్పులని దృష్టిలో ఉంచుకొని ఆటోమొబైల్ దిగ్గజాలు వాహనాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఉన్న చిన్న చిన్న లోపాలని అధికమిస్తూ మరింత బెటర్ వెర్సన్స్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
భారత్ లో ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న సీఎన్జీ కార్లలో 70 శాతం మారుతి సుజుకి సంస్థకు చెందినవి ఉండటం విశేషం. ఇక ఈ మోడల్స్ ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, జపాన్ లలో కూడా నడుస్తున్నాయి. భవిష్యత్తులో కార్భన్ ఉద్గారాలని తగ్గించే దిశగా ఆటోమొబైల్ రంగం అడుగులు వేస్తుందని, అందులో బయోగ్యాస్ అతిపెద్ద ఇంధనంగా ఎలక్ట్రిసిటీ తర్వాత మారుతుందని మారుతి సుజుకి పేర్కొంది. దీనికోసం ఇప్పటికే బయో గ్యాస్ ఉత్పత్తి కోసం ఇండియాలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, బనాస్ డెయిరీతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అలాగే ఆవుపేడతో తయారయ్యే ఇంధనం తయారు చేసే కంపెనీతో జపాన్ లో ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఈ బయోగ్యాస్ ని ఇంధన వనరుగా గ్రామీణ ప్రాంతాలలో విరివిగా ఉపయోగించే వారు. మళ్ళీ దాంతో నడిచే కార్లని మారుతి మార్కెట్ లోకి తేవడం నిజంగా ఆసక్తికర విషయం అని చెప్పాలి.
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
This website uses cookies.